Begin typing your search above and press return to search.

దోమకొండలో ఉపాసన ఇరగదీస్తోంది

By:  Tupaki Desk   |   16 Aug 2017 9:38 AM GMT
దోమకొండలో ఉపాసన ఇరగదీస్తోంది
X
ఇప్పుడు తెలుగు స్టార్ వైఫ్స్ లో ఉపాసన కామినేని కి ఉన్న స్థానం ప్రత్యేకం అనే చెప్పాలి. అంటే కేవలం రామ్ చరణ్‌ ను చేసుకోవడం గానే పాపులార్టి వచ్చింది అనే దానికంటే.. ఆమె అపోలో వారసురాలిగా అలాగే తన తండ్రి తరుపున చూసుకుంటున్న దోమకొండ కోట మరియు సంస్థానం వారి అమ్మాయిగా చాలా పేరు ప్రఖ్యాతులే పొందింది. ఇప్పుడు దోమకొండలో ఉంటూ.. ఏం చేస్తోందో చూద్దాం పదండి.

నిజానికి ఉపాసన ఈ మధ్యనే బాగా వెయిట్ తగ్గిపోయింది. తను అలా ఎలా తగ్గిందో చెబుతూ.. ఇప్పుడు ఒక వారం నుండి ఆన్ లైన్లో రోజూ వర్కవుట్స్ గురించి ఆ వీడియోల రూపంలో ట్రైనింగ్ ఇస్తోంది. అయితే నిన్న స్వాతంత్ర్యదినోత్సవం కావడంతో దోమకొండ వెళ్ళి.. అక్కడ తన 90 ఏళ్ళ తాతగారితో జండా వందనం చేయించింది. ఆ తరువాత అక్కడి ఆడపడుచులకు గృహిణులకు అసలు ఎలాంటి వర్కవుట్ చేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారో చెప్పి.. వర్కవుట్ చేయడానికి వారందరికీ షూస్ ఫ్రీగా ఇచ్చి.. వారికి ట్రైనింగ్ ఇస్తోంది. ఇదంతా కూడా కేవలం సేవా కార్యక్రమమే. ఇలా ఇరగదీస్తూ సినిమా లవ్వర్స్ మనస్సు కూడా దోచుకుంటోంది ఉపాసన.

ప్రస్తుతం రామ్ చరణ్‌ హైదరాబాద్ లో రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి.. ఉపాసన వర్కువుట్స్ లో మనోడు మిస్సవుతున్నాడట. ఏదో ఒక రోజు ఒక వీడియోలో మనకు రామ్ చరణ్‌ కూడా ఉపాసన కోసం విచ్చేసి వర్కవుట్ టిప్స్ ఇస్తాడటలే. అది సంగతి.