Begin typing your search above and press return to search.

ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్న ఉపాస‌న!

By:  Tupaki Desk   |   27 Oct 2016 7:30 PM GMT
ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్న ఉపాస‌న!
X
రామ్ చ‌ర‌ణ్ పెళ్లినాటి సంగ‌తి ఇది..! అప్ప‌ట్లో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌పై కొన్ని విమ‌ర్శ‌లు వినిపించాయి. ఉపాస‌న లావుగా ఉందంటూ చెర్రీకి త‌గిన జోడీ కాదంటూ కొంత‌మంది అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. అంతేకాదు, ఆ మ‌ధ్య చెర్రీ-ఉపాస‌న‌లు విడిపోతున్న‌ట్టు కూడా కొన్ని పుకార్లు వ‌చ్చాయి. అవి పుకార్లే కాబట్టి, చెర్రీ కూడా వాటిని సీరియ‌స్ గా తీసుకోలేదు. ఉపాస‌న కూడా స్పందించ‌లేదు. జూనియ‌ర్ చెర్రీ ఎప్పుడు పుడ‌తాడంటూ అభిమానులు కూడా ఈ మ‌ధ్య ఆరాట‌ప‌డుతున్నారు. ఈ విష‌యాల గురించి తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడింది ఉపాస‌న‌!

పెళ్లికి ముందు తాను కాస్త బొద్దుగా ఉండేదాన్న‌ని ఉపాస‌న చెప్పింది. పెళ్లి జ‌రుగుతున్న‌ప్పుడు చ‌ర‌ణ్‌కు స‌రిజోడీ కాద‌ని కూడా కొన్ని విమ‌ర్శ‌లు వినిపించాయ‌నీ, వాటిని తాను పాజిటివ్ గా తీసుకున్నాన‌ని ఉపాస‌న చెప్పింది. చ‌ర‌ణ్ కు చాలామంది ఫ్యాన్స్ ఉంటార‌నీ, వారిలో అమ్మాయిలు కూడా చాలామంది ఉంటార‌నీ, వారు కూడా ద బెస్ట్ కావాల‌ని కోరుకుంటారు క‌దా అని భావించాన‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. ఇక‌, విడాకుల పుకార్ల‌పై స్పందిస్తూ... ‘మేమిద్దం మంచి స్నేహితులం, బెస్ట్ క‌పుల్స్‌, విడాకుల గురించి ఆలోచించాల్సిన ప‌రిస్థితి మా మ‌ధ్య లేదు. పుకార్లు... క‌థ‌నాలూ అంటారా.. రాసుకునేవారు ఎలా రాసుకున్నా మేం ప‌ట్టించుకోం. మా మ‌ధ్య ఏం జ‌రిగినా ధైర్యంగా న‌లుగురికి చెప్పుకోగ‌లం’ అంటూ ఖండించారు.

పిల్ల‌ల విష‌య‌మై కూడా ఉపాస‌న ఓపెన్ గా మాట్లాడారు. ఇప్ప‌ట్లో పిల్లల గురించి ఆలోచించ‌డం లేదనీ, అయినా అది పూర్తిగా త‌మ వ్య‌క్తిగ‌త‌మైన విష‌య‌మ‌ని చెప్పింది. ఎంతో క‌ష్ట‌ప‌డి బరువు త‌గ్గాన‌నీ, మ‌ళ్లీ పిల్ల‌లు అంటే చాలా బ‌రువు పెర‌గాల్సి వ‌స్తుంద‌నీ, అందుకే కాస్త భ‌య‌ప‌డుతున్నాన‌ని ఉపాస‌న చెప్పింది. పైగా, ఇంటి నిర్మాణం జ‌రుగుతోంద‌నీ, అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక‌, ప‌క్కాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని వివ‌రించింది. అత్త‌మామ‌లు త‌న‌ను చాలా బాగా చూసుకుంటార‌నీ, త‌న గురించి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటార‌నీ, వారి ప్రేమాభిమానాలు ఒక్కోసారి త‌న‌కు క‌ళ్లు చెమ‌ర్చేలా చేస్తాయ‌ని ఉపాస‌న ఎమోష‌న‌ల్ గా చెప్పింది.

ఇదే సమయంలో మామయ్య (చిరు) గారి 150వ సినిమా గురించి చరణ్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారని.. సినిమా గురించి ఆయన సిద్ధంగా ఉన్నారంటే తన భార్యగా నేను కూడా కశ్చితంగా ఉన్నట్లే అని చరణ్ నిర్మాణ సారధ్యంపై స్పందించింది. కుటుంబంలో ఈ సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నారని, ఆయన మరలా తెరపైన కనిపించబోతున్నారంటేనే అది చాలా అద్భుతం అనిపిస్తుందని తెలిపారు ఉపాసన.

ఈ సందర్భంలో తనకు అసహ్యమైన విషయాలను కూడా ప్రస్థావించిన ఉపాసన... వ్యాయామం అంటే తనకు అసహ్యం అని చెప్పారు. వ్యాయామం చేయడం అంటే అదో పెద్ద టార్చర్ లా అనిపిస్తుందని, చరణ్ రోజుకు రెండు మూడు సార్లు వ్యాయామం చేయడం చూసినపుడు తాను కూడా జిమ్ కు వెళ్లాల్సిందే, ఖచ్చితంగా చేయాలి అనుకుంటారట కానీ... ఈ విషయంలో తాను చాలా బద్దకస్తురాలిని అని చెబుతున్నారు ఉపాసన.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/