Begin typing your search above and press return to search.

సునీల్ రొటీన్ గా వచ్చేశాడు..

By:  Tupaki Desk   |   23 Feb 2017 1:38 PM GMT
సునీల్ రొటీన్ గా వచ్చేశాడు..
X
రొటీన్ సినిమాలకు కాలం చెల్లిపోతున్న టైంలోవరుసగా మూస సినిమాలు చేసి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్. వరుసగా ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు ఫ్లాపులు తిన్నాడు సునీల్. గత ఏడాదే అతడికి మూడు ఫ్లాపులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అతడి ఆశలన్నీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉంగరాల రాంబాబు’ మీదే ఉన్నాయి.

కొన్ని రోజుల కిందటే ఈ సినిమా లోగోను లాంచ్ చేశారు. అది కొంచెం భిన్నంగా అనిపించింది. ఇప్పడు మహాశివరాత్రి కానుకగా సునీల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇది మాత్రం రొటీన్ గా అనిపిస్తోంది. ఉంగరాలేసుకుని ఎప్పట్లాగే కొంచెం స్టైలిష్ ఔట్ ఫిట్ లో తయారై వచ్చాడు సునీల్. రెండు చేతుల వేళ్లకూ ఉంగరాలేసుకోవడం మినహాయిస్తే లుక్ పరంగా ఏం వైవిధ్యం లేదు. మరి సినిమాలో ఏమైనా వైవిధ్యం చూపిస్తాడేమో చూడాలి.

ఓనమాలు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి హార్ట్ టచింగ్ సినిమాలు చేసిన క్రాంతి మాధవ్.. సునీల్ తో సినిమా అనే సరికి అతడి స్టయిల్లోకే మారినట్లుగా కనిపిస్తోంది. మొన్న రిలీజ్ చేసిన సాంగ్ మేకింగ్ వీడియో కానీ.. ప్రస్తుత ఫస్ట్ లుక్ కానీ.. ఇది రొటీన్ సినిమానే అన్న భావన కలిగిస్తున్నాయి. ఐతే సినిమాలో భీభత్సమైన కామెడీ ఉంటుందని.. తెలుగు సినిమా చరిత్రలో ఇది నిలిచిపోతుందని క్రాంతి మాధవ్ అంటున్న నేపథ్యంలో ఇందులో ఏమంత ప్రత్యేకత ఉందో చూడాలి. మార్చి రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసి.. సినిమాను వేసవి కానుగా ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాత పరుచూరి కిరీటి అంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/