Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రేంజ్ పెరిగిందోచ్..

By:  Tupaki Desk   |   18 May 2018 6:42 AM GMT
టాలీవుడ్ రేంజ్ పెరిగిందోచ్..
X
టాలీవుడ్ తన పరిధిని పెంచుకుంటోంది. రీజనల్ సినిమా అనే సరిహద్దు దాటి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కొత్త ప్రయోగాలు.. టెక్నికల్ వాల్యూస్ తో తెలుగులో వస్తున్న సినిమాలు మిగిలిన భాషల వారిని ఆకట్టుకుంటున్నాయి. అందుకే తెలుగులో సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి.

ఇలాంటి టైంలో టాలీవుడ్ లో ఓ డీల్ నిర్మాతలందరినీ ఆశ్చర్య పరిచింది. టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రాబోయే ఆరు సినిమాల ఆడియో అండ్ డబ్బింగ్ రైట్స్ కు రూ. 20 కోట్లకు పైగానే ఆఫర్ వచ్చిందని లేటెస్ట్ టాక్. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఓనర్ ఉమేష్ గుప్తా ఈ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. వీటిలో మహేష్ బాబుతో తీయబోయే సినిమాతోపాటు నితిన్ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం కాకుండా ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇంతవరకు ఆడియో బిజినెస్ కే పరిమితమైన ఉమేష్ గుప్తా తమిళ డబ్బింగ్ మూవీ ఖాకీతో ప్రొడ్యూసర్ గా మారారు.

టాలీవుడ్ లో ఈ తరహా డీల్ కుదరడం ఇదే మొదటిసారి. డబుల్ హ్యాట్రిక్ హిట్లతో రికార్డు కొట్టిన బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు దీంతో కొత్త రికార్డు దక్కించుకున్నారని చెప్పాలి. ఇంతవరకు తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కు పాతికో.. పరకో అన్నట్టుగా ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారి టాలీవుడ్ మార్కెట్ పెరగడం నిర్మాతలకు మేలు చేసేదే.