Begin typing your search above and press return to search.

కుక్కలు మొరుగుతాయ్..పట్టించుకోను

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:30 AM GMT
కుక్కలు మొరుగుతాయ్..పట్టించుకోను
X
ఎంటర్టైన్మెంట్ ఫీల్డులో ఉన్నపుడు మన గురించి చాలా మంది చాలా అనుకుంటారని.. వాటన్నింటినీ పట్టించుకుంటే బతకలేమని అంది ఉదయభాను. ప్రెగ్నెన్సీ వల్ల కొంత కాలంగా లైమ్ లైట్లో లేకుండా పోయిన ఉదయభాను.. ఇంకో వారం పది రోజుల్లో కవలలకు జన్మనివ్వబోతున్నట్లు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో ఇచ్చింది. ఈ సందర్భంగా తన గురించి రూమర్లు పుట్టించేవాళ్లపై.. విమర్శలు గుప్పించేవాళ్లపై ఉదయభాను మండి పడింది.

‘‘ఎంటర్టైన్మెంట్ ఫీల్డులో అమ్మాయిల పరిస్థితి అద్దాల ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. ఎవరైనా మనమీదికి రాయి విసరొచ్చు. మనల్ని మనం కాపాడుకోవాలి. తట్టుకోవాలి. పోరాడాలి. ఈ రంగంలో సానుకూలతలు ఉంటాయి. ప్రతికూలతలూ ఉంటాయి. ఇక్కడికి రావడం ఒక రకంగా శాపం.. ఇంకో రకంగా వరం. డబ్బు.. పేరు.. రూమర్లు.. అన్నీ వస్తాయి. సక్సెస్‌ లో ఉన్నవాళ్లను చూస్తే ఒక రాయి విసరకుండా ఉండలేరు జనాలు. కానీ వాళ్ల గురించి నేను పట్టించుకోను. గుడిలో ఉండే దేవతను చూసి వీధిలో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. వాటి వల్ల దేవత గొప్పదనం పడిపోదని నా ఫ్రెండొకరు చెప్పారు. అది నిజం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది ఎక్కువగా జరగుతుంది.

చిన్న వయసులోనే ఈ ఫీల్డులోకి రావడం వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నా. నేను చాలామందికి సాయం చేశాను. కానీ వారి నుంచి ఆశించిన అభిమానం దక్కలేదు. ఐతే నాకు ఇప్పుడు నా భర్త విజయ్ నుంచి కావాల్సినంత ప్రేమ దొరకుతోంది. ప్రపంచమంతా ఒక్కటై నావైపు వేలెత్తి చూపిస్తున్నా.. ఆ వేలుని విరిచి నా వెన్నంటి ఉండే భర్త దొరికాడు. ఇంతకంటే ఏం కావాలి. ఇప్పుడు నా బిడ్డలు కూడా రాబోతున్నారు. ప్రపంచంలోని ప్రేమంతా నా సొంతం కాబోతోంది’’ అని ఉదయభాను ఉద్వేగంగా చెప్పింది.