బాలయ్య గొప్పదనం గురించి చెప్పిన ఉదయభాను

Sun Nov 19 2017 21:45:26 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో ‘లెజెండ్’ సినిమాకు పెద్ద పీట వేసిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతం. ఇలాంటి తరుణంలో బాలయ్య పెద్ద మనసును చాటిచెప్పే ఓ ఉదంతం గురించి యాంకర్.. నటి ఉదయభాను ఒక టీవీ షోలో భాగంగా చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కవల పిల్లల పుట్టిన రోజుకు బాలయ్య ఎంతో పెద్ద మనసుతో వచ్చి ఆశీర్వదించడం గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురైంది ఉదయభాను.‘‘చిన్న వయసులోనే కుటుంబాన్ని నడపడానికి పని చేయడం మొదలుపెట్టాను. నా జీవితంలో సెలబ్రేషన్స్ అన్నవే లేవు. నా జీవితంలోలోనే మొట్ట మొదటి పండగ నా కవల పిల్లల తొలి పుట్టిన రోజు. ఆ వేడుకను ఇండస్ట్రీ వాళ్లతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాను. చాలామందికి కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు బాలయ్య గారికి ఒక మెసేజ్ పెట్టా. అంతే ఆయన కాల్ బ్యాక్ చేసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. తర్వాతి రోజు ఆయనకు మీటింగ్ ఉన్నా కూడా సరే ఫంక్షన్ కి వచ్చి వెళ్తానని చెప్పారు. కరెక్టుగా రాత్రి ఏడున్నరకు అలా సింహాలాగా వచ్చారు. నాకైతే అప్పుడు ఆయనలో ఒక దేవుడు కనిపించాడు. ఫంక్షణ్ కి వచ్చి అందరు సెలబ్రెటీల్లాగా ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోలేదు. 45 నిమిషాలు ఉండి అందరితో నవ్వుతూ ఫొటోలు దిగారు. అతని లాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా రేర్. హ్యాట్సాఫ్ బాలయ్య. హ్యాట్సాఫ్ బాలయ్య’’ అని ఉదయభాను అంది.