మెగా వెడ్డింగ్ రాదా!!

Thu Jul 12 2018 20:00:01 GMT+0530 (IST)

మెగా డాటర్ నీహారిక కుర్ర హీరో నాగ అశ్విన్  జంటగా పాకెట్ సినిమా కొలాబరేషన్ తో యువి సంస్థ నిర్మించిన హ్యాపీ వెడ్డింగ్ ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించి ఆ మేరకు పోస్టర్లు కూడా విడుదల చేసారు. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఇది వాయిదా వేసే అవకాశం ఉన్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నెల 21న ప్రీ రిలీజ్ ప్లాన్ చేసారు. మెగా ఫామిలీ నుంచి ఎవరు గెస్టులుగా వస్తారు అనే వివరాలు కూడా ఇంకా బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో రిలీజ్  పోస్ట్ పోన్ అవుతుందా  అంటే ఏమో చెప్పలేం అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. దానికి సరిగ్గా ఒక్క రోజు ముందు సుశాంత్ నటించిన చిలసౌ విడుదల అవుతోంది. రెండు ఒకదానికి  ఒకటి పోటీ ఇచ్చే సినిమాలు కాదు కానీ రెండింటిలో నేపధ్యం మాత్రం ఒకటే కావడంతో క్లాష్ మాత్రమే కాదు పోలిక కూడా వస్తుంది.ఇది నిజమని నిర్ధారణగా చెప్పలేం కానీ వస్తున్న సమాచారాన్ని బట్టి హ్యాపీ వెడ్డింగ్ డేట్ ని మార్చేందుకు యువి సంస్థ చర్చలు జరుపుతోంది అనే టాక్  మాత్రం వస్తోంది. విడుదలకు  పదిహేను రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కు సరిపోదు అనుకున్నారో లేక ఇంకాస్త టైం తీసుకుని పబ్లిక్ లోకి సినిమా కాన్సెప్ట్ వెళ్లేలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి. ఇప్పటికైతే డేట్ 28గానే ఉంది. హీరో హీరోయిన్ల పరంగా హాల్స్ నింపే  ఓపెనింగ్స్ తీసుకొచ్చే స్థాయి ఇద్దరికీ లేదు కాబట్టి కంటెంట్ ను ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బాగా మొదటి రోజు వసూళ్లు ఉంటాయి. ఆ తర్వాత టాక్ ని బట్టి  ఊపందుకుంటాయి. మరి ఇవన్నీ విశ్లేషించే  నిర్ణయం మార్చే దిశగా ఆలోచన జరుగుతోందా వేచి చూడాలి.