Begin typing your search above and press return to search.

అనుష్కకి అక్కడ అంత సీన్ ఉందా?

By:  Tupaki Desk   |   27 Sep 2016 7:30 AM GMT
అనుష్కకి అక్కడ అంత సీన్ ఉందా?
X
స్వీటీ అనుష్కకి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఎక్కువే. అందుకే టాలీవుడ్ లో కొత్తగా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారంటే.. మొదట స్వీటీ పేరే వినిపిస్తుంది. ప్రస్తుతం అనుష్క చేస్తున్న ఇలాంటి ఓ మూవీ భాగమతి. ఇప్పటికే భాగమతి బిజినెస్ వ్యవహారాలను కూడా మొదలుపెట్టేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.

ఓవర్సీస్ రైట్స్ కోసం అప్రోచ్ అయిన ఓ డిస్ట్రిబ్యూటర్ కి.. భాగమతి భారీ షాక్ ని ఇచ్చారని తెలుస్తోంది. అనుష్క లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకి 4 కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో సంప్రదించిన ఈ డిస్ట్రిబ్యూటర్ కి.. మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారట. తాము కనీసంగా 7 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని తేల్చేశారట. దీంతో ఆయన సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. గతంలో రుద్రమదేవికి డబ్బులొచ్చాయంటే.. అది పీరియాడికల్ మూవీ. గుణశేఖర్ లాంటి డైరెక్టర్ తో పాటు.. బన్నీ కీ రోల్ చేయడం.. చిరు వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటి ఎన్నో ఎలిమెంట్స్ అక్కడ పని చేశాయి. అన్నిటికీ మించి గ్రాఫిక్స్ మాయాజాలం స్పెషల్ అట్రాక్షన్

కానీ భాగమతి విషయానికొస్తే.. ఇవేమీ లేవు సరికదా, పిల్ల జమీందార్ ఫేమ్ దర్శకుడు అశోక్ తెరకెక్కించాడు. ఓ ఎపిసోడ్ ను మినహాయిస్తే.. మిగతా అంతా ప్రస్తుత టైమ్ తో పాటు నడిచే సోషల్ డ్రామా. అయినా సరే తమ సినిమా 1.5మిలియన్ డాలర్లు రాబట్టేస్తుందని యూవీ క్రియేషన్స్ నమ్ముతోందట. అయినా సరే ఈ రేట్ చాలా ఎక్కువ అని.. స్టార్ వాల్యూ విపరీతంగా ఉండి.. యూఎస్ లో క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ ని 7 కోట్లకు విక్రయించారని చెబుతున్నారు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు. మరి వీళ్ల ఐడియా ఎలా ఉందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/