Begin typing your search above and press return to search.

చెర్రీకి హోల్ సేల్ టెండర్ వేశారే

By:  Tupaki Desk   |   19 Jun 2018 4:30 PM GMT
చెర్రీకి హోల్ సేల్ టెండర్ వేశారే
X
ప్రభాస్ స్నేహితుల బ్యానర్ గా మొదలైన యువీ క్రియేషన్స్.. టాలీవుడ్ లో సర్రున దూసుకుపోతోంది. సినిమా నిర్మాణాలు మాత్రమే కాకుండా.. డిస్ట్రిబ్యూషన్.. ఎగ్జిబిటింగ్ విభాగాల్లో కూడా స్పీడుగానే విస్తరిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పట్టు ఉన్న ఈ సంస్థ.. రామ్ చరణ్ మూవీ రంగస్థలంతో మంచి లాభాలను కళ్లచూసింది.

ప్రభాస్-చరణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. నైజాం ఏరియా మొత్తానికి రంగస్థలంను కొనుగోలు చేసిన ఈ సంస్థ.. భారీ లాభాలనే ఆర్జించింది. దీంతో చరణ్ మరుసటి సినిమా విషయంలో.. రెండు తెలుగు రాష్ట్రాలకు హోల్ సేల్ డీల్ మాట్లాడుకునేందుకు చర్చలను నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ సంస్థకు ఇప్పటికే సీడెడ్ తో పాటు.. ఉత్తరాంధ్ర.. కృష్ణా.. గుంటూరు.. తూర్పు గోదావరి ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ పై గ్రిప్ ఉంది. రంగస్థలంతో నైజాంలో కూడా సత్తా చాటడంతో.. ఏకంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు డీల్ సెట్ చేసుకోవాలన్నది వీరి ఉద్దేశ్యం అని అంటున్నారు.

ఇప్పటికే నిర్మాత డీవీవీ దానయ్యతో రేటు విషయంలో ఓ అవగాహన కూడా కూడా వచ్చారట. అగ్రిమెంట్స్ చేసుకోకపోయినా.. యూవీ సంస్థకే చరణ్- బోయపాటి మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయట. రేటు విషయంలోనే ఓ ఐదు కోట్ల దగ్గర అటూ ఇటూ ఉన్నారట. సుమారుగా 75 కోట్లకు ఈ బేరం ఫైనల్ కావచ్చని ఇండస్ట్రీ జనాల టాక్.