వ్యభిచారం కేసులో 'విక్టిమ్ ఏ' ఎవరు?

Thu Jun 14 2018 11:36:23 GMT+0530 (IST)

అమెరికాలో జరుగుతున్న ఓ హైఎండ్ సెక్స్ రాకెట్ ఇప్పుడు బహిర్గతం అయింది. ఏప్రిల్ నెలలోనే ఈ కేసుకు సంబంధించిన అరెస్టులు జరిగినా.. తాజాగా కోర్టులో హాజరు పరచడం.. కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు యూఎస్ పోలీసులు.ఈ కేసు విషయంలో పలువురిని విచారించగా.. విక్టిమ్ ఏ అంటూ పేరు లేకుండా చెప్పుకొచ్చిన ఓ నటి గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ జరిగింది. ఇతడి సెక్స్ రాకెట్ లో భాగమైన ఈమె గురించి..నిందితుడి మెయిల్ ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. 'ఇకపై ఎప్పుడూ నన్ను కాంటాక్ట్ చేయద్దు. చేసినా నేను అందుబాటులోకి రాను. నీలాంటి వాడితో బిజినెస్ వ్యవహారాలు సరికాదు. ఇకపై ఎప్పుడూ నీతో వ్యాపారం చేయదలచుకోలేదు. మరోసారి నన్ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే.. అధికారికంగా నీపై ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది' అంటూ విక్టిమ్ ఏ మెయిల్ లో ఉన్నట్లు యూఎస్ పోలీసులు వెల్లడించారు.

ఇంతకీ ఈ నిందితుడితో ఇంతగా సెక్స్ రాకెట్ లో భాగం అయిన ఆ దక్షిణాది హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇప్పుడు తీవ్రమైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఔత్సాహికులు అయితే.. రకరకాల పేర్లను కూడా ప్రచారంలోకి తీసుకొచ్చేస్తున్నారు.