సెక్స్ రాకెట్ లో ఐదుగురు హీరోయిన్లపై కేసు!

Sun Jun 17 2018 15:16:17 GMT+0530 (IST)

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్లతో మోదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ - చంద్రకళ దంపతులు నడుపుతోన్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని....ఓ నటి ఇచ్చిణ ఫిర్యాదుతో ఈ సెక్స్ రాకెట్ బట్టబయలైంది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫెడరల్ ఏజెన్సీ అధికారులు కిషన్ - చంద్రకళలను అరెస్టు చేశారు. అయితే ఈ సెక్స్ రాకెట్ లో దక్షిణాదికి చెందిన 5గురు హీరోయిన్లు అప్రూవర్లుగా మారినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్లను ఎఫ్ బీఐ అధికారులు దాదాపు 6గంటలపాటు ప్ర ప్రశ్నించగా వారు ఆ సెక్స్ రాకెట్ గురించి సంచలన విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. బెంగళూరు - చెన్నైకు చెందిన ఇద్దరు బడా హీరోయిన్లు - ఫ్లాప్ అయిన ద్విభాషా చిత్రంలో నటించిన ఓ హీరోయిన్ - తాజాగా పాలిటిక్స్ లో చేరిన చిన్న నటి - కొన్ని తెలుగు బ్లాక్ బస్టర్స్ హిట్స్ లో నటించిన కన్నడ నటి - పలు సినిమాల్లో నటించినా సక్సెస్ కాని మరో హీరోయిన్ ఉన్నట్లు తెలుస్తోంది. కిషన్ అకృత్యాలను వారు పోలీసులకు వెల్లడించారని తెలుస్తోంది.గత ఏడాది డిసెంబర్ 26న కిషన్ ఆహ్వానం ప్రకారం తాను పెన్సిల్వేనియాలో డ్యాన్స్ షోకు వెళ్లానని అక్కడ తనతో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు కిషన్ ప్రయత్నించారని ఆరోపించింది. తాను కస్టమర్లున్న గదిలో అరగంట సేపు బలవంతంగా ఉండాల్సి వచ్చిందని - తాను వ్యభిచారం చేయలేదని తెలిపింది. తాను బస చేసిన హోటళ్లలోకి కస్టమర్లను కిషన్ పంపేవాడని - తన సభ్యులను చంపేస్తానని బెదిరించి బలవంతంగా వ్యభిచారం చేయించాడని తెలిపింది. తమ పక్క ప్లాట్లో తనకు కిషన్ దంపతులు బస ఏర్పాటు చేసి విటులను పంపేవారని వేరే దారి లేక వ్యభిచారం చేయాల్సి వచ్చిందని మరో నటి వాపోయింది. మరోవైపు - ఆ హీరోయిన్లపై వ్యభిచారం - అనైతికత కింద పోలీసులు అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ లు పంపిన ఆహ్వానాలు - వీసాలతో వారు అమెరికాకు రావడంతో ఆ అసోసియేషన్ లపై కూడా కేసులు నమోదు చేశారు. వ్యభిచారం అభియోగాల కింద వారి పేర్లను న్యాయమూర్తికి ఇచ్చిన పోలీసులు....పబ్లిక్ కాపీలో మాత్రం ఏ - బీ - సీ - డీ - ఈ అంటూ ప్రస్తావించారు. 'వితవుట్ కమిట్ మెంట్'తో వచ్చిన హీరోయిన్లను ఒత్తిడి - ప్రలోభాలు - బెదిరింపులకు గురిచేసి - వారితో వ్యభిచారం చేయించారని కిషన్ దంపతులపై చార్జ్ షీట్ ను పోలీసులు నమోదు చేశారు.