రిసిప్షన్ కూడా.. టూ టైమ్స్

Fri Oct 13 2017 14:03:30 GMT+0530 (IST)

టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య సమంత పెళ్లికి ముందు వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. ఇక పెళ్లి అనుకున్న దాని కంటే ఎక్కువ స్థాయిలోనే జరిగింది. అయితే ఇప్పుడు మరొక అక్కినేని వేడుక గురించి మళ్లీ ఆ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల  సంప్రదాయల ప్రకారం ఇద్దరు బాగానే పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికి చాలా మంది ఆత్మీయులు హాజరు కాలేదు.మొదట్లో పెళ్లి అయిపోగానే తర్వాత రిసిప్షన్ ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఇంతవరకు దాని గురించి అధికారికంగా ఏ న్యూస్ లేదు. నాగ చైతన్య కూడా అలాంటిది ఏమి వద్దని నాగార్జున తో చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మరొక న్యూస్ వైరల్ గా మారింది. రెండు సార్లు పెళ్లి చేసుకున్నట్టే రెండు సార్లు రిసిప్షన్ ని నిర్వహించనున్నారని టాక్. అయితే ముందుగా నాగ చైతన్య తల్లి లక్ష్మీ చెన్నై లో గ్రాండ్ గా రిసిప్షన్ ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆ వేడుకలో దగ్గుపాటి ఫ్యామిలీ వారు అక్కినేని ఫ్యామిలీ వారు హాజరుకానున్నారట.

ఇక నాగార్జున కూడా త్వరలోనే హైదరాబాద్ లో మరొక గ్రాండ్ రిసిప్షన్ కి ఏర్పాట్లను చెయ్యడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ వేడుకకి టాలీవుడ్ కొలీవూడ్ నుండి సినీ ప్రముఖులు రానున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం చైతు - సమంత బిజీగా ఉన్నారని వారి డేట్స్ దొరికినప్పుడు తప్పకుండా నిర్వహిస్తామని నాగ్ రీసెంట్ గా రాజు గారి గది 2 ప్రమోషన్ లో చెప్పారు. మరి ఆ రెండు వేడుకలు ఏ స్థాయిలో జరుగుతాయో చూడాలి.