Begin typing your search above and press return to search.

రాఘవుడి పాటలు రెండేనా!!

By:  Tupaki Desk   |   17 Sep 2018 6:05 AM GMT
రాఘవుడి పాటలు రెండేనా!!
X
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ జెట్ స్పీడ్ తో ఒకపక్క షూటింగ్ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. విడుదల అక్టోబర్ 11న ఫిక్స్ అయినట్టే కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడా జాప్యం లేకుండా అనుకున్న రీతిలో అన్ని ప్లాన్ ప్రకారం కానిచ్చేస్తున్నారు. హరికృష్ణ అకాల మరణంతో కాస్త బ్రేక్ ఇచ్చిన టీమ్ మొన్న ఫస్ట్ ఆడియో సింగిల్ విడుదల చేసి హంగామా షురూ చేసింది. హీరోయిన్ అరవింద పాత్రను వర్ణిస్తూ తన ప్రేమ కోసం రాఘవుడు ఎంతగా తపించిపోతున్నాడో సిరివెన్నెల సాహిత్యంతో తమన్ స్వరపరిచిన ట్యూన్ బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇకపోతే ఇందులో మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే మొత్తం ఆల్బంలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉంటాయట. అందులోనూ డ్యూయెట్స్ రెండే అని తెలిస్తే ఫ్యాన్స్ షాక్ కాక మానరు. ఇది అఫీషియల్ గా టీమ్ చెప్పినది కాకపోయినప్పటికీ నిజమయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం.

సో ఉన్న నాలుగు పాటల్లో రెండు డ్యూయెట్స్ పోగా మిగిలిన వాటిలో ఒకటి సోలో సాంగ్ కాగా బాలన్స్ ఉన్న చివరిది బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే థీమ్ సాంగ్ గా చెబుతున్నారు. ఫారిన్ షెడ్యూల్ లో మరో పాటను అనుకున్నప్పటికీ టైం లేదు కాబట్టి అనవసరంగా రిస్క్ చేయటం ఎందుకులే అని భావించి త్రివిక్రమ్ అది పూర్తిగా డ్రాప్ అయినట్టు సమాచారం. ఆడియోలో ఆ ట్రాక్ పొందుపరిచకపోవచ్చని తెలిసింది. అంటే జూనియర్ ప్రధాన బలమైన డాన్సులు కేవలం రెండు పాటలకే పరిమితమవుతాయన్న మాట. మొన్న రిలీజ్ అయిన సింగిల్ కూల్ మెలోడీ కాబట్టి అందులో మాస్ కి వెర్రెక్కే స్టెప్స్ ఉండకపోవచ్చు. ఇంకో డ్యూయెట్ ప్లస్ సోలో సాంగ్ లో మాత్రమే తారక్ మేజిక్ స్టెప్స్ చూడొచ్చన్న మాట. జై లవకుశ-జనతా గ్యారేజ్ లాంటి వాటిలో మూమెంట్స్ తో అదరగొట్టిన తారక్ ఈసారికి రెండు పాటలకే పరిమితమైనా భీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆ లోటును పూర్తిగా భర్తీ చేస్తాయని సమాచారం.