Begin typing your search above and press return to search.

అక్కినేనీస్.. మ‌రో రెండు తీపి జ్ఞాప‌కాలు?

By:  Tupaki Desk   |   15 July 2019 6:46 AM GMT
అక్కినేనీస్.. మ‌రో రెండు తీపి జ్ఞాప‌కాలు?
X
అక్కినేని కాంపౌండ్ కి 2018 నిరాశ‌ను మిగిలిస్తే.. 2019 గుడ్ స్టార్ట్ అనే చెప్పాలి. స‌మంత న‌టించిన `ఓ బేబి` ఘ‌న‌విజ‌యం అక్కినేని కాంపౌండ్ కి మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా నిలుస్తోంది. చై-సామ్ న‌టించిన‌ `మ‌జిలీ` స‌క్సెస్ త‌ర్వాత సామ్ `ఓ బేబి` ఆ కాంపౌండ్ కి ఊర‌ట క‌లిగించే విజ‌యం అని చెప్పాలి. ఈ రెండిటి త‌ర్వాత నెక్ట్స్ ఏంటి? అంటే అక్కినేని నాగార్జున న‌టిస్తున్న `మ‌న్మ‌ధుడు 2` .. అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న `వెంకీ మామ‌` రిజల్ట్ గురించే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ రెండిటిపైనా అక్కినేని ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ రెండూ విజ‌యాలు సాధిస్తే 2019 అక్కినేనీస్ కి క‌లిసొచ్చిన సంవ‌త్స‌రంగా డిక్లేర్ చేయొచ్చు.

కింగ్ నాగార్జున నటిస్తున్న‌ `మ‌న్మ‌ధుడు 2` టీజ‌ర్ కి ఫ్యాన్స్ నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ జోన‌ర్ లో రాహుల్ ర‌వీంద్ర‌న్ గ్రిప్పింగ్ గానే చూపించ‌బోతున్నార‌నే అభిమానులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆగ‌స్టు 9 రిలీజ్ తేదీని లాక్ చేశారు. `సాహో`కి వారం ముందు వ‌స్తున్నా ఈ చిత్రం విజ‌యంపై చిత్ర‌బృందం ధీమాని వ్య‌క్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకి ర‌కుల్ ప్రీత్ గ్లామ‌ర్.. స‌మంత కామియో ప్ర‌ధాన అస్సెట్స్‌ కానున్నాయి.

మ‌రోవైపు ద‌స‌రా బ‌రిలో విక్ట‌రీ వెంక‌టేష్‌- అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న `వెంకీమామ‌`ను రిలీజ్ చేస్తున్నామ‌ని చిత్ర నిర్మాతల్లో ఒక‌రైన‌ వివేక్ కూచిభొట్ల (పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ) ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో క‌న్ఫామ్ చేశారు. అంటే ద‌స‌రా బ‌రిలో మ‌రో అక్కినేని సినిమా ఫ్యాన్స్ కి ట్రీటివ్వ‌బోతోంది. `వెంకీ మామ‌`లో చైతూ ఆర్మీ అధికారిగా క‌నిపిస్తార‌ని విలేజ్ నేప‌థ్యంలోనూ అత‌డి పాత్ర చిత్ర‌ణ ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది. మామ వెంకీతో అల్లుడు చైత‌న్య కామెడీ టైమింగ్ సింక‌యితే హిట్ కొట్టే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కె.ఎస్ ర‌వీంద్ర అలియాస్ బాబి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాశీ ఖ‌న్నా- పాయ‌ల్ రాజ్ పుత్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. `మ‌న్మ‌ధుడు 2`.. `వెంకీమామ` చిత్రాలు అక్కినేని కాంపౌండ్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వ‌నున్నాయో వేచి చూడాల్సిందే.