Begin typing your search above and press return to search.

ABCD కి ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు.. ఇదీ నిజం!

By:  Tupaki Desk   |   18 May 2019 7:13 AM GMT
ABCD కి ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు.. ఇదీ నిజం!
X
అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఏబీసీడీ థియేట‌ర్ల‌లో కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సంజీవ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీ‌ధ‌ర్ - య‌శ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై క్రిటిక్స్ పెద‌వి విరిచేసిన సంగ‌తి తెలిసిందే. శిరీష్ ఎంతో ప‌రిణ‌తితో న‌టించినా కానీ.. మ‌రోసారి అత‌డి ఫేట్ ఎలా ఉండబోతోందో.. థియేట‌ర్ రెస్పాన్స్ ఎలా ఉండ‌నుంది? అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. దీంతో పాటు ఫిలింస‌ర్కిల్స్ లో ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

వాస్త‌వానికి ఏబీసీడీ చిత్రానికి సంజీవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా.. ఒక‌రు కాదు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు హ్యాండిల్ చేసిన సినిమా ఇదీ! అంటూ ఇటీవ‌ల ఫిలింన‌గ‌ర్ జ‌నాలు చెవులు కొరుక్కున్నారు. పైగా అల్లు శిరీష్ కొన్ని సీన్లను మార్చేందుకు డిమాండ్ చేశార‌ని.. క్రియేటివ్ పార్ట్ లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యార‌న్న ముచ్చ‌టా సాగింది. అందుకే రిలీజ్ ఆల‌స్య‌మైంద‌ని ముచ్చ‌టించుకున్నారు. ఏబీసీడీ తొలుత ప్ర‌క‌టించిన తేదీ త‌ర్వాత ఏకంగా రెండు నెల‌ల ఆల‌స్యంగా రిలీజైంది. అందుకు కార‌ణం డైరెక్టర్ల మార్పు.. సీన్లు తిప్పి తీయ‌డం అంటూ ముచ్చ‌టించుకున్నారు. ఇదే ప్ర‌శ్న నిర్మాత మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ని అడిగితే ఆయ‌న చెప్పిన జ‌వాబు ఇదీ...

ఏబీసీడీకి ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు అంటూ ప్ర‌చార‌మైన మాట నిజ‌మే. అవ‌న్నీ రూమ‌ర్లు మాత్ర‌మే. ఏబీసీడీ మ‌ల‌యాళ వెర్ష‌న్ ని తెలుగైజ్ చేసేందుకు ఒక‌రికి మించి న‌లుగురి సాయం కోరాం. ద‌ర్శ‌కులు బీవీఎస్ ర‌వి.. కృష్ణ చైత‌న్య‌.. ప‌వ‌న్ సాధినేని.. వాసు వ‌ర్మ ల సాయం తీసుకున్నాం. మ‌ల‌యాళ వెర్ష‌న్ ఆత్మ‌ను తీసుకుని ప్ర‌స్తుతానికి త‌గ్గ‌ట్టు క‌థ‌ను.. స‌న్నివేశాల్ని మ‌లిచాం. అందుకోసం అవస‌రం మేర మార్పు చేర్పులు చేయించాం. స్క్రీన్ ప్లే ప‌రంగా ఆ న‌లుగురి సాయం కోరాం.. అని తెలిపారు. ఇక కాన్పెప్ట్ బేస్డ్ సినిమాలు.. రియ‌ల్ లైఫ్ పై సినిమాలు తీయ‌డం అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని మ‌ధుర శ్రీ‌ధ‌ర్ వెల్ల‌డించారు. వ‌రుస‌గా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీస్తున్నాం. పెద్ద సినిమాలు నిర్మిస్తాం అని తెలిపారు. కాన్సెప్టు ఉన్న చిన్న సినిమాల‌కు తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాన‌ని అన్నారు. ప్ర‌స్తుతం దొర‌సాని చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.