Begin typing your search above and press return to search.

ఈ సినిమా ఎలా చేతులు మారిందంటే

By:  Tupaki Desk   |   24 Aug 2016 7:30 PM GMT
ఈ సినిమా ఎలా చేతులు మారిందంటే
X
ఇప్పుడు ''టు కంట్రీస్‌'' సినిమా గురించి చాలా డిస్కషన్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ మలయాళం సినిమాను విక్టరీ వెంకటేష్‌ హీరోగా తీస్తారని అనుకుంటే.. తరువాత బండ్ల గణేష్‌ రైట్స్ కొనుక్కున్నా అన్నాడు.. ఇప్పుడు ఎన్.శంకర్ ఈ సినిమాను సునీల్ హీరోగా రీమేక్ చేస్తున్నట్లు అఫీషియల్ గా డిక్లేర్ చేసేశారు. ఇంతకీ అసలు ఈ మొత్తం ప్రాసెస్ లో ఏం జరిగి ఉంటుంది?

ఇదే విషయాన్ని ఒక సీనియర్ డిస్ర్టిబ్యూటర్ పంచుకుంటూ.. ''కొందరు పెద్ద హీరోలు ఈ సినిమాను రీమేక్ చేద్దాం అనుకున్నారు. అప్పుడే బండ్ల గణేష్‌ ఈ సినిమా మలయాళ ప్రొడ్యూసర్ రంజిత్ తో తాను రీమేక్ హక్కులను కొనుక్కుంటన్నట్లు ఎగ్రిమెంట్ సైన్ చేసుకుని వచ్చాడు. కాని ప్రాజెక్టు సెట్ చేసుకోవడం అతని వలన కాలేదు. వెంకటేష్‌ చేయనన్నాడు. తరువాత రామ్‌ హీరోగా చేద్దాం అనుకుంటే.. స్రవంతి రవికిషోర్ కు సినిమా నచ్చింది కాని.. రామ్ కు నచ్చలేదు. ఆ తరువాత సినిమాను అల్లరి నరేష్‌ హీరోగా రీమేక్ చేయాలని అనిల్ సుంకర.. భీమినేని.. మరో ఇద్దరు నిర్మాతలు ప్రయత్నించారు. కాని రీమేక్ రైట్స్ కు వీళ్ళందరూ 30 లక్షల కంటే ఎక్కువ పెట్టడానికి ఇష్టపడలేదు. ఇక దర్శకుడు ఎన్.శంకర్ మాత్రం 43 లక్షలకు ఈ రీమేక్ హక్కులను కొనుక్కున్నాడు. సినిమాలో పొటన్షియల్ చాలానే ఉంది కాబట్టి.. ఆయన కొనేశాడు. దానితో గణేష్‌ ఎగ్రిమెంట్ డిజాల్వ్ చేసి.. శంకర్ కు అమ్మేశారు'' అంటూ సెలవిచ్చారు.

అదన్నమాట అసలు కథ. ఇప్పుడు అర్ధమైందా.. టు కంట్రీస్ సినిమా సునీల్ చేతిలోకి ఎలా వచ్చిందో.