పవన్ సినిమాకి ట్విట్టర్ ఎమోజి

Thu Oct 12 2017 11:41:09 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పేరు అజ్ఞాతవాసి అని ఇప్పటివరకూ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ.. దాదాపుగా ఇదే పేరు ఖాయం అయిపోయినట్లే. ఇప్పటికే నిర్మాతలు ఇదే పేరును రిజిస్టర్ కూడా చేయించేయడంతో.. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. పవర్ స్టార్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పై.. నిర్మాతలు ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు.సరికదా.. అన్ని రకాల ఆప్షన్స్ ఉపయోగిస్తూ.. అజ్ఞాతవాసికి హైప్ విపరీతంగా పెంచేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసిపై ఓ ట్విట్టర్ ఎమోజిని నిర్మాతలు బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా ఒక ట్విట్టర్ ఎమోజి లాంఛ్ అవుతున్న తొలి చిత్రంగా పవన్ కళ్యాణ్ మూవీ రికార్డ్ సృష్టించబోతోంది. కోలీవుడ్ హీరో విజయ్ నటించి మెర్సల్(తెలుగులో అదిరింది) చిత్రం.. ఇలా ట్విట్టర్ ఎమోజీ లాంఛ్ చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ మూవీ రికార్డుల లిస్ట్ లో ఉంది. తెలుగు విషయానికి వస్తే.. బాహుబలి2 చిత్రానికి ఫేస్ బుక్ లో కేరక్టర్ ఆధారిత స్టిక్కర్స్ ను లాంఛ్ చేశారు. ఇప్పుడు అజ్ఞాతవాసి ద్వారా ట్విట్టర్ ఎమోజి ప్రమోషన్ ను కూడా టాలీవుడ్ స్టార్ట్ చేసినట్లు ్యింది.

పవన్ కళ్యాణ్ కు జోడీగా కీర్తి సురేష్.. అను ఇమాన్యుయేల్ ఈ చిత్రంలో నటిస్తుండగా.. ఓ సాఫ్ట్ వేర్ సంస్థకు అధిపతిగా పవర్ స్టార్ కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ఖుష్బూ.. ఆది పినిశెట్టి.. బొమన్ ఇరానీ ఇతర కీలక పాత్రలలో నటించనుండగా.. జనవరి 10న పవన్ 25వ చిత్రం రిలీజ్ అవుతుందని ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.