Begin typing your search above and press return to search.

ముంబయ్ కి దెయ్యం వచ్చిందని చెప్పనా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 12:21 PM GMT
ముంబయ్ కి దెయ్యం వచ్చిందని చెప్పనా?
X
బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకల్ ఖన్నా అంటే అందరికీ ఆమె చేసిన సినిమాలు గుర్తుకు రావటం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ట్వింకల్ ఖన్నా మాజీ హీరోయిన్ మాత్రమే కాదు స్టార్ హీరో భార్య అంతే కాకుండా రెండు పుస్తకాల రచయత. ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసర్ కూడాను. ట్వింకల్ అడిగిన ప్రశ్నకు చాలా ఫన్నీ గా సమాధానం ఇస్తుంది అందులో ఎక్కడో చిన్న మెలికపెట్టి అందరినీ కొంచెం అర్ధంకాని ఇరకాటంలో పెట్టేస్తుంది. ఇప్పుడు తన పాప జుత్తు కట్ చేసుకొనని మారాం చేస్తుంటే ఈ విషయానికి ఈ మధ్య రాత్రి వేళలో ఏవో దుష్ట శక్తులు వచ్చి ఆడవారి జుత్తును కత్తిరించుకొని వెళ్లిపోతుంది అనే కట్టుకథకు ముడిపెట్టి ఒక ట్వీట్ పోస్ట్ చేసింది.

ఉత్తరప్రదేశ్‌ - మధ్యప్రదేశ్‌ - డిల్లీలో ఈ మధ్య ఒక దెయ్యం వచ్చి ఇలా ఆడవారి జుత్తు కత్తిరించి వెళ్లిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి కదా దీనికి తన వెటకారం జత చేసి ఇలా అంటుంది. ట్వింకిల్‌ కుమార్తె నిటారా జుట్టు కత్తిరించుకోవడానికి ఒప్పుకోవటం లేదట. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా ఈ విదంగా సరదాగా చెప్పింది ‘మా పాప జుట్టు కత్తిరిస్తానంటే ఒప్పుకోవడం లేదు. నేను రాత్రి పాప జుట్టు కత్తిరించి ముంబయికి కూడా జుట్టు కత్తిరించే దెయ్యం వచ్చిందని చెప్పనా?' అని పోస్ట్ చేసింది. దీనికి ఆమెను ఫాలో అవుతున్న అభిమానులు ఆమె చమత్కారానికి తెగ మెచ్చుకుంటున్నారు. ఈమెను ఇప్పుడు బాలీవుడ్ లో మిసెస్ ఫన్నీ బోన్స్ అంటున్నారు. ట్వింకల్ ఖన్నా రాసిన మిసెస్ ఫన్నీ బోన్స్ బుక్ కి మంచి స్పందన రావడంతో ఆ వెంటనే ది లెజండ్ ఆఫ్ లక్ష్మి ప్రసాద్ బుక్ ఒకటి రాసి సీజ నల్ రైటర్ గా మారింది. ఇప్పుడు మరో బుక్ విడుదలకు సిద్దం చేస్తుంది.

ఆర్ బాల్కి డైరెక్ట్ చేస్తున్న ‘పాడ్ మాన్’ కు ట్వింకల్ ఖన్నా రాసిన ఒక షార్ట్ స్టోరీనే ఆదారం అని తెలుస్తుంది. ఈ పాడ్ మాన్ ని ట్వింకల్ ఖన్నానే ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. ఈ సినిమాలో తన భర్త బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. సోనమ్ కపూర్ - రాధిక ఆప్టే హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ట్వింకల్ పుస్తకాలులో ఉండే సరదా మాటలు కావలిసినన్ని ఉండబోతున్నాయి అని చెబుతున్నారు.​