Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: హస్తర్ శాపం మనందరికీ వరం!

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:07 PM GMT
టీజర్ టాక్: హస్తర్ శాపం మనందరికీ వరం!
X
ఈ ఇండియన్ సినిమాకు ఏమైంది? ఒక్క తెలుగులోనే కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి అని ముచ్చటపడేలోపే హిందీ లో అర్థం కాని పేరుతో 'తుంబడ్' అనే పేరుతో ఒక థ్రిల్లర్ సినిమా తీసి దాన్ని తెలుగు లోకి డబ్బింగ్ చేసి అదే అర్థం కాని టైటిల్ తెలుగు వెర్షన్ కి కూడా పెట్టి ట్రైలర్ వదిలారు.

ఆ ట్రైలర్ ఇలా స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ గంభీరంగా వినిపిస్తోంది. విజువల్స్ కాస్త మిస్టరీ ని చూపించే తరహాలోనే ఉన్నాయి. ఆ డైలాగ్ "పూర్తి దేవి. ఈ భూమి తన కడుపులోనే ఉంది.. ఈ విశ్వం ఏర్పడినపుడు దేవి ఈ కోటలో నుంచే 16 కోట్ల దేవతలకు జన్మనిచ్చింది… తన మొదటి బిడ్డ మీద దేవికి అమితమైన ప్రేమ ఉండేది… వాడి పేరు హస్తర్..! ఎన్నో యుగాలు గడిచిపోయాయి… హస్తర్ తన తల్లి కడుపులోనే నిద్రపోతున్నాడు. ఒకరోజు వాడు మన పూర్వీకులకు గుర్తొచ్చాడు. వాడి పేరు మీద ఒక దేవాలయాన్ని నిర్మించారు."

అంతలో ఒక చిన్న బాబు "ఎందుకని మనం హస్తర్ ను లేపాలి?' అని అడుగుతాడు. అప్పుడు "హస్తర్ శాపం మనందరికీ వరం".. అని చెపాడు అవతల మనిషి.. "నేను నిన్ను భయపెట్టట్లేదు… తుంబడ్ కు సిద్ధం చేస్తున్నాను" మరి ఈ సినిమాలో ఆ హస్తర్ ఎవరో.. ఆ 'తుంబడ్' సంగతేంటో తెలియాలంటే మనం అక్టోబర్ 12 వరకూ వేచి చూడక తప్పదు. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాజ్ కుమార్ హిరాని ఈ సినిమా టీజర్ ను మెచ్చుకున్నాడు! ఇక సంజు బాబా సినిమా ను సూపర్ హిట్ చేసిన 'పీకే' డైరెక్టర్ కు నచ్చిన తుంబడ్ సినిమా టీజర్ చూడండి.

యాజ్ యుజువల్ గా టెక్నికల్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. పైగా ఇదో ఫాంటసీ థ్రిల్లర్ కాబట్టి కాస్త డిఫరెంట్ గా కూడా అనిపిస్తోంది. ఇక 'తుంబడ్' మీనింగ్ కోసం గూగుల్ ని అడిగితే తెల్లమొహం వేసింది.. సో... సినిమా రిలీజ్ అయిందాకా వెయిట్ చెయ్యాలి.. తప్పదు!