Begin typing your search above and press return to search.

డేటు మార్చమంది డిస్ర్టిబ్యూటర్లంటగా...

By:  Tupaki Desk   |   10 Oct 2015 3:30 AM GMT
డేటు మార్చమంది డిస్ర్టిబ్యూటర్లంటగా...
X
ఒక్కో సినిమాను ఒక్కొక్క ఏరియాకు కోటి రూపాయలు పెట్టి కొంటుంటే.. ప్లానింగ్ అనేది వారు చెప్పినట్లు చేయకుండా ఇంకెవరు చెప్పినట్లు చేస్తారు మరి? ప్రస్తుతం చాలా ఏరియాల్లో పంపిణీదారులు ఎలా చెబితే ఆ టైపులోనే నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలను రిలీజ్‌ ప్లాన్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఏదో ఒక సెట్‌ ఆఫ్‌ హీరోలకైతే పర్లేదు కాని.. మిగిలినవారందరూ పంపిణీదారుల మాట వినాల్సిందే.

వచ్చే సంక్రాంతి గురించి ఇప్పుడే ప్లానింగ్‌ మొదలైపోయింది. జనవరి 8న జూనియర్‌ ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో కన్‌ ఫామ్‌ అయ్యింది కాని.. 15న డిక్టేటర్‌ మాత్రం ఇంకా కన్‌ ఫామ్‌ కాలేదు. ఇంతలోనే నాగార్జున కార్తీ చేసిన మల్టీస్టారర్‌ మూవీ ఊపిరి ని మాత్రం సంక్రాంతికి తెస్తానంటూ పివిపి సెలవిస్తున్నారు. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ను తన సినిమా పోస్టుపోన్‌ చేసుకోమని కోరారట డిస్ట్రిబ్యూటర్లు. ''అ..ఆ'' సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని ఎంతో కోరుకున్నాడు మన జులాయ్‌ డైరక్టర్‌. కాని పంపిణీదారుల ఒత్తిడి వలనే సినిమాను ఫిబ్రవరి 14కు మార్చారట. నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి చేతిలో చాలా ధియేటర్లు ఉన్నప్పటికీ.. ఎడ్జస్టుమెంట్‌ మాత్రం కష్టం అని తెలియడంతోనే వాయిదా వేశారని తెలుస్తోంది.

ఇకపోతే అనూహ్యంగా చిన్నదాన నీకోసం సినిమా ఫ్లాప్‌ తరువాత స్లో అయిపోయిన నితిన్‌ బాబు.. ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమాతో పుంజుకోవాలని ఆశిస్తున్నాడు. లేటుగా వచ్చినా పర్లేదు కాని.. మా నితిన్‌ కు ఒక బ్లాక్‌ బస్టర్‌ తీసిపెట్టవయ్యా త్రివిక్రమూ!!!