Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్.. ఏంటీ కొత్త కొత్త ఆలోచనలు

By:  Tupaki Desk   |   5 Aug 2015 7:26 AM GMT
త్రివిక్రమ్.. ఏంటీ కొత్త కొత్త ఆలోచనలు
X
త్రివిక్రమ్ సడెన్ గా ఈ మార్పేంటో జనాలకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ బడా హీరోలతోనే పని చేసే త్రివిక్రమ్ ఈసారి నితిన్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోవడమే ఆశ్చర్యం. ఇక మిగతా కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయంలోనూ త్రివిక్రమ్ అడుగులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తో పని చేయబోతున్నాడని వార్త బయటికి వచ్చిన మరుసటి రోజు టాలీవుడ్ జనాలు అస్సలు ఊహించని మరో టెక్నీషియన్ ను త్రివిక్రమ్ తన సినిమాలోకి తీసుకున్నట్లు ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఆ టెక్నీషియన్ మరెవరో కాదు.. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్.

ఒకప్పుడు మణిరత్నం సినిమాలకు రెగ్యులర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మీనన్.. ఆ తర్వాత డైరెక్షన్లోకి కూడా అడుగుపెట్టాడు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది లాంటి భిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు తీస్తూ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కి దూరమైపోయాడు మీనన్. త్రివిక్రమ్ శైలి ప్రకారం చూస్తే అతడి సినిమాకు మీనన్ ఎలా సెట్టవుతాడో జనాలకు అర్థం కావడం లేదు. దేవీతో బాగానే బండి నడుస్తుండగా.. అనిరుధ్ ఎందుకు లైన్లో కి వచ్చాడో జనాలకు అర్థం కాలేదు. ఇంతలోనే ప్రసాద్ మూరెళ్లను పక్కనబెట్టి రాజీవ్ మీనన్ ను తీసుకోవాలనుకోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదంతా చూస్తుంటే త్రివిక్రమ్ ఏదో ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నాడేమో అని సందేహం కలుగుతోంది.