Begin typing your search above and press return to search.

మసాలా తగ్గిన రాఘవుడిపై పెనుభారం

By:  Tupaki Desk   |   22 Sep 2018 7:09 AM GMT
మసాలా తగ్గిన రాఘవుడిపై పెనుభారం
X
ఏ కథతో సినిమా తీసినా అందులో సందేశం పాళ్ళు ఎంత ఉన్నా స్టార్ హీరోల విషయంలో కొన్ని ప్రాధమిక సూత్రాలను పాటించడం తప్పనిసరి. ఇది అందరు దర్శకులకు వర్తిస్తుంది. ఫ్యాక్షనిజం వద్దు అనే మెసేజ్ తో చిరు బాలయ్యలు సినిమాలు తీసినా అందులో మాస్ కు కిక్కిచ్చే పాటలు అద్భుతంగా అమిరాయి కాబట్టే అవి మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి. తారక్ సైతం ఆది-సింహాద్రి లాంటి వాటినే చూసుకుంటే అందులో దేనికీ కొదవ ఉండదు. అందుకే అవి అల్ టైం బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ అరవింద సమేత వీర రాఘవ విషయంలో త్రివిక్రమ్ ఎత్తుగడ అర్థం కాక ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. కారణం ఆడియో ఆల్బమ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్న ఆడియోలో డాన్స్ కు అవకాశం ఇచ్చినది మాస్ కి ఊపిచ్చేది కేవలం ఒక్కటే కావడంతో కొందరు అభిమానులు తమ అసంతృప్తిని బయటికే చెప్పేస్తున్నారు. మరికొందరు కథ డిమాండ్ చేసింది కాబట్టే తారక్ సైతం ఒప్పుకుని ఉంటాడు అని సర్దిచెప్పుకుంటున్నారు.

ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొత్తంలో మొదటి సినిమా నిన్ను చూడాలనితో మొదలుపెట్టి గత ఏడాది వచ్చిన జై లవకుశ దాకా తీసుకుంటే ఒకే ఒక్క డాన్స్ నెంబర్ ఆల్బమ్ లో ఉండటం ఇదే మొదటిసారి. బాలరామాయణం చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది కాబట్టి కౌంట్ లోకి రాదు. మరి త్రివిక్రమ్ ఇంత ధైర్యంగా రెండు సీరియస్ సాంగ్స్ ఒక కూల్ మెలోడీ తో పాటు ఒకే ఒక్క మాస్ నెంబర్ ను ఎందుకు పెట్టాడా అనే అనుమానం రాకమానదు. అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ లో ఇది ఫక్తు సీమ హింసను నేపధ్యంగా తీసుకున్న కథని అంత స్పష్టంగా చెప్పినప్ప్పుడు ఒకటో రెండో మాస్ నెంబర్స్ జోడించి ఉంటే సరిపోయేది. కానీ అలా జరగలేదు. షూట్ చేసే టైం లేదనో లేక నిజంగా కథకు అడ్డురాకూడదు అనే రేంజ్ లో సబ్జెక్టు ఉందో తెలియాలంటే అక్టోబర్ 11 దాకా వేచి చూడాల్సిందే. ఎంత మిశ్రమ స్పందన వచ్చినా పెనివిటి అనగనగా రెడ్డి ఇటు సూడు పాటలు మాత్రం జనంలోకి బాగా వెళ్లిపోయాయి. మరి ఇంకో పాట ఉంటే బాగుండేదే అనే ఫీలింగ్ రాకుండా అంత మేజిక్ త్రివిక్రమ్ ఏం చేసాడో.