Begin typing your search above and press return to search.

రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ ని స్కైలో లేపేశారు!

By:  Tupaki Desk   |   11 Oct 2018 2:52 PM GMT
రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ ని స్కైలో లేపేశారు!
X
ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` సినిమాకి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వం వ‌హించినా .. ఈ సినిమాకి పాక్షికంగా ఫైట్ మాష్ట‌ర్లు రామ్ - ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌కత్వం వ‌హించార‌ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడే అన‌డం చ‌ర్చ‌కొచ్చింది. క‌వ‌ల‌సోద‌రుల కెరీర్‌ లో త్రివిక్ర‌ముడు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇద‌ని చెప్పొచ్చు. అర‌వింద స‌మేత‌లో ఫ్యాక్ష‌న్ కంటే యాక్ష‌న్ కంటే ఎమోష‌న్‌ కే అధిక ప్రాధాన్య‌మివ్వ‌డం - ఇంట‌ర్వెల్ సీక్వెన్సులో ఫైట్ వ‌గైరా మంచి పేరు తెచ్చాయి. ఆ క్రెడిట్ అంతా రామ్ ల‌క్ష్మ‌ణ్‌ దేన‌ని త్రివిక్ర‌ముడు నేటి స‌క్సెస్ మీట్‌ లో అన‌డం హాట్ టాపిక్ అయ్యింది.

ప్ర‌సాద్ లాబ్స్‌ లో జ‌రిగిన స‌క్సెస్ మీట్‌లో త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ - ``ఈ సినిమా గురించి అస‌లు నాకు తెలియ‌ని వారే ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నా నంబ‌ర్ ఎలాగో తెలుసుకుని ప్ర‌శంసించ‌డం చూస్తుంటే సంతోషం క‌లిగింది. స్పందన అద్భుతం. అయితే ఈ క్రెడిట్ అంతా ఎన్టీఆర్ కే ద‌క్కుతుంది. ఆయ‌న‌ నాకంటే ఎక్కువ న‌మ్మి ఈ క‌థ‌లో న‌టించారు. పాట‌లు త‌గ్గుతున్నాయా.. డ్యాన్సులు త‌గ్గుతున్నాయేమో అనేది ఆలోచించ‌వ‌ద్ద‌ని - ఒక మంచి క‌థ‌ను జెన్యూన్‌ గా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌మ‌ని ఎన్టీఆర్‌ అన్నాడు. అందుకే ఈ విజ‌యంలో అస‌లు కార‌కుడు అత‌డే. అందుకే నేను త‌న‌కే థాంక్స్ చెబుతాను .. అనీ అన్నారు.

ఈ చిత్రంలో బెస్ట్ యాక్ష‌న్ కి క్రెడిట్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌ల‌కే ఇవ్వాల‌ని ఈ సందర్భంగా త్రివిక్ర‌మ్ అన్నారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ వాళ్ల స్థాయిని మించారు ఎపుడో. వారు ఫైట్ మాష్ట‌ర్లు కాదు. క‌థ‌లో ఒక భాగాన్ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగిన ప్ర‌తిభావంతులు. టైమ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆ సంగ‌తిని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఓ యాక్ష‌న్ క్లైమాక్స్ అనుకుని దానిని డిజైన్ చేసి రీడిజైన్ చేసిన‌ది ఫైట్ మాష్ట‌ర్లు. అస‌లు యాక్ష‌న్ ఉండాలో వ‌ద్దో చెప్పింది వాళ్లే. కొన్ని ఫైట్స్ గురించి రామోజీ ఫిలింసిటీలో కూచుని మ‌రీ డిస్క‌స్ చేశాం. ప్ర‌తిసారీ వాళ్ల ఇన్‌పుట్స్ వ‌ర్క‌వుట్ అయ్యాయి.. అని తెలిపారు.