అల్లు మూవీని ఆకాశానికి ఎత్తిన గురూజీ

Mon Apr 15 2019 17:26:06 GMT+0530 (IST)

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు శిరీష్ కమర్షియల్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. పలు చిత్రాలు చేసినా కూడా ఇప్పటి వరకు కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ లను అల్లు శిరీష్ దక్కించుకోలేదు. దాంతో కాస్త టైం తీసుకుని మంచి సినిమాలను కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలను చేయాలనే ఉద్దేశ్యంతో 'ఏబీసీడీ' అనే చిత్రాన్ని శిరీష్ చేశాడు. అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశృ' అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర శ్రీధర్ ఈ చిత్రంను సంజీవ్ దర్శకత్వంలో నిర్మించడం జరిగింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. గురూజీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న గురూజీ మాట్లాడుతూ అల్లు శీరీష్ పై మరియు చిత్రంపై పొగడ్తల వర్షం కురిపించాడు. త్రివిక్రమ్ మాట్లాడుతూ... జల్సా చిత్రం సమయంలో శిరీష్ ను చిన్న కుర్రాడిగా చూశాను. అప్పట్లోనే అతడికి సినిమాలపై చాలా అండర్ స్టాండింగ్ ఉంది. సినిమాలను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి శిరీష్. ఇలాంటి వారు ఎక్కువ సినిమాలు చేయాలి అప్పుడే మంచి సినిమాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. డబ్బున్న కుర్రాలు కష్టాలు పడితే ఎలా ఉంటుందనేది సరదాగా చూపించారు. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. పాటలు కూడా విన్నాను చాలా బాగున్నాయి. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన భరత్ గురించి త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భరత్ కు నేను అభిమానిని అతను నటించిన ఢీ రెఢీ చిత్రాలు నాకు బాగా ఇష్టం అందులోని అతడి కామెడీని బాగా ఎంజాయ్ చేశాను. భరత్ ను ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నాకు ఫ్యాన్ మూమెంట్ అన్నాడు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మించే మధుర శ్రీధర్ గారికి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అంటూ త్రివిక్రమ్ చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్దం అవుతోంది.