Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ టైటిల్ ‘అ’ది కాదు

By:  Tupaki Desk   |   15 May 2018 5:09 AM GMT
ఎన్టీఆర్ టైటిల్ ‘అ’ది కాదు
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ స్పీడందుకుంది. ఈ మూవీ టైటిల్ ఏం పెడుతున్నారన్న దానిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. సాధారణంగా సినిమా ప్రొడక్షన్ దశలో ఉండగానే త్రివిక్రమ్ టీం నుంచి రకరకాల టైటిళ్లు వినిపిస్తుంటాయి. ఈ మూవీకి కూడా ఇప్పటికే అసామాన్యుడు అనే టైటిల్ పరిశీలనలో ఉందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.

‘అ’ అక్షరంతో పెట్టే టైటిల్ కలిసొస్తుందని త్రివిక్రమ్ ఈ టైటిల్ పెట్టి ఉంటాడని.. ఈ టైటిల్ ఏమంత బాగోలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతడి ఇమేజ్ కు తగ్గ టైటిల్ కాదంటూ కొన్ని కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ పై ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి క్లారిటీ వచ్చింది. అసామాన్యుడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేయలేదని.. ఏ టైటిల్ పెట్టాలన్న దానిపై యూనిట్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అభిమానులకు క్లియర్ గా చెప్పేశారు.

ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే నాటికి టైటిల్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుని ఆ రోజున అనౌన్స్ చేయాలని యూనిట్ భావిస్తోంది. దీనివల్ల రూమర్స్ కు చెక్ పెట్టడంతో పాటు అభిమానులకు ఆనందం పంచినట్టవుతుందని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట. అజ్ఞాతవాసితో ‘అ’ సెంటిమెంట్ పెద్దగా వర్కవుటవదని తేలిపోయింది కాబట్టి త్రివిక్రమ్ కొత్త టైటిల్ వైపు చూస్తాడా.. లేక మళ్లీ ‘అ’తో మొదలయ్యే టైటిల్ పైనే దృష్టి పెడతాడా అన్నది అప్పటికి తేలిపోవచ్చు.