Begin typing your search above and press return to search.

గ్యాప్ లో బన్నీ-త్రివిక్రమ్ కానిచ్చేస్తారా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 10:30 PM GMT
గ్యాప్ లో బన్నీ-త్రివిక్రమ్ కానిచ్చేస్తారా?
X
సినిమాల ఎంపికలో చాలా స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తున్నాడు అల్లు అర్జున్. కొన్నేళ్లుగా కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్న బన్నీ.. సినిమా సినిమాకు తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో సినిమాకు, సినిమాకు గ్యాప్ వచ్చినా పట్టించుకోవట్లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ మొదలవడానికి ముందు కూడా బన్నీ బాగానే గ్యాప్ తీసుకున్నాడు. అంతకు ముందు రేసుగుర్రం - సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ‘సరైనోడు’ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు కూడా బాగానే గ్యాప్ వచ్చేలా ఉంది.

ఇంకా ‘24’ పనులు పూర్తి చేయలేదు విక్రమ్. ఆ తర్వాత అతను బన్నీ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేయడానికి కనీసం ఆరు నెలలైనా టైం పడుతుందట. ఐతే ఎప్పట్లా ఖాళీగా ఉండిపోకుండా ఈ గ్యాప్‌ లో ఓ సినిమా చేసేద్దామని ఫిక్సయ్యాడట బన్నీ. తనకు బాగా క్లోజ్ అయిన త్రివిక్రమ్ తోనే ఆ సినిమా కానిచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ ఈ మధ్య బాగా స్పీడందుకుని వేగంగా స్క్రిప్టు రాసి, వేగంగా సినిమాలు చేసేస్తున్న సంగతి తెలిసిందే. ‘జులాయి’ తరహా సింపుల్ మూవీ ఒకటి చేయాలని ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చారట. హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కొచ్చని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.