Begin typing your search above and press return to search.

చెర్రీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి ప్రాబ్లెం

By:  Tupaki Desk   |   29 Nov 2015 1:30 AM GMT
చెర్రీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి ప్రాబ్లెం
X
త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా చేసేందుకు ఏ స్టార్ హీరో అయినా సై అనాల్సిందే. అలాగే చెర్రీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా ఓ మూవీ తెరకెక్కుతుందని చాలా కాలంగా అంటున్నారు కానీ.. ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కడం లేదు.

బ్రూస్ లీ తర్వాత రామ్ చరణ్ - త్రివిక్రమ్ ల మూవీపై మళ్లీ కొన్నాళ్లు మాటలు నడిచాయి. కానీ ఇప్పుడవి ఆగిపోయాయి. నిజానికి ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు.. నిర్మాత డీవీవీ దానయ్య బాగానే ట్రై చేశాడు. ఎందుకంటే ఈయన దగ్గర చెర్రీ డేట్స్ ఉన్నాయి. గతంలోనే త్రివిక్రమ్ కి ఓ మూవీ కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాడు దానయ్య. దాంతో ఈ రెండు ప్రాజెక్టులను ఒకటి చేసి, ఓ మూవీ చేద్దామని ఆలోచించాడు. అయితే, బ్రూస్ లీ సక్సెస్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ.. అది నిరుత్సాహకర ఫలితం ఇచ్చింది. దీంతో వెంటనే అదే నిర్మాతతో పిక్చర్ చేసేందుకు చెర్రీ ఉత్సాహం చూపలేదు.

ఇదే సమయంలో త్రివిక్రమ్ కూడా సూర్యకి ఇప్పటికే కమిట్ మెంట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం అ..ఆ.. తీస్తున్న ఈ మాటల మాంత్రికుడు.. తర్వాత ప్రాజెక్ట్ ని సూర్యతో టేకప్ చేయనున్నాడు. కానీ సూర్యతో సినిమా చేసేందుకు దానయ్య బడ్జెట్ విషయంలో సిద్ధంగా లేడు. మరోవైపు అఖిల్ డిజాస్టర్ తర్వాత అఖిల్ కూడా త్రివిక్రమ్ తో మూవీ చేయాలని అనుకుంటున్నాడు. దీంతో దానయ్య అడుగులు అటువైపు పడుతున్నట్లు తెలుస్తోంది.