త్రివిక్రమ్ స్టైల్ రివర్స్ లో ఉంటుందా ?

Sun Sep 23 2018 14:00:12 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ సందడి మెల్లగా పీక్స్ కు చేరుకుంటోంది. ఆడియోలో కేవలం నాలుగే పాటలు ఉండటం పట్ల అభిమానుల్లో కొంత అసంతృప్తి ఉన్నా రెస్పాన్స్ పట్ల యూనిట్ మాత్రం హ్యాపీగా ఉంది. ఇక నిన్నటి నుంచి ఎడిటింగ్ కాకుండా సిజి వర్క్ కోసం ఉద్దేశించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ లీకు రూపంలో ఆన్ లైన్ లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. వెంటనే జాగ్రత్త పడిన హారిక అండ్ హాసిని టీమ్ దాన్ని ఇంకా వైరల్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో తలమునకలయ్యారు. అందులో ఉన్న భీభత్సమైన వయోలెన్స్ చూసి ఫ్యాన్స్ తో సహా ఇది ఇంటర్వెల్ ముందుగా వచ్చే ఎపిసోడ్ గా రకరకాల అంచనాలు వేస్తున్నారు. కానీ ఇక్కడే తాను ఎందుకు డిఫరెంట్ గా ఆలోచిస్తాను అని ప్రూవ్ చేసేందుకే త్రివిక్రమ్ ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ని టైటిల్స్ కు ముందే ప్లాన్ చేసాడట. అంటే ఈ సీన్ ముగిశాక తారక్ ని కొత్తగా చూపించి పూజా హెగ్డే లవ్ ట్రాక్ తో మొదలు పెడతారన్న మాట. ఇలాంటివి అధికారికంగా చెప్పే అవకాశం లేదు కానీ అంచనాలు మాత్రం ఇంకాస్త పెరిగేలా ఉన్నాయి.గతంలో విడుదల చేసిన టీజర్ లోనే హింసను ఓ రేంజ్ లో చూపించి హీరోయిజం ని ఎక్స్ ప్లోయిట్ చేసిన త్రివిక్రమ్ సినిమాలో సైతం ఎక్కడా తగ్గలేదని టాక్. ఫ్యాక్షన్ నేపథ్యంలో కథనాలు మరీ వైవిధ్యంగా చూపించే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటినే తనదైన ట్రేడ్ మార్క్ టేకింగ్ తో గూస్ బంప్స్ వచ్చేలా తీసాడని  ఇన్ సైడ్ టాక్. రెగ్యులర్ ఫార్మట్ లో కాకుండా ఇంటర్వెల్ బ్లాక్ లో రావాల్సిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ లో ఒకదాన్ని ఇలా టైటిల్స్ లో వేయడం అంటే ఖచ్చితంగా కొత్త ట్రెండ్ అనే చెప్పాలి. అక్టోబర్ 11న విడుదల కానున్న అరవింద సమేత వీర రాఘవ కోసం ఫ్యాన్స్ ఏర్పాట్లు మొదలుపెట్టేసారు. ఇంకో 17 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఉత్సుకత పెరుగుతోంది. ఈ మధ్య లీకులు కూడా హిట్ సెంటిమెంట్ గా మారుతున్నాయి కాబట్టి అరవింద సమేతకు అది కూడా కలిసి వచ్చినా వస్తుందేమో.