ఎన్టీఆర్ కోసం అతడి స్వరాలేనా?

Tue Aug 29 2017 12:28:26 GMT+0530 (IST)

ప్రస్తుతం టాలీవుడ్ లో పరభాషా సంగీత దర్శకులు బాగానే వస్తున్నారు. కోలీవుడ్ - బాలీవుడ్ కి బాణీలను అందించిన యువ దర్శకులు ఇక్కడ అవకాశాలు వస్తే ఏ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు ఇదే తరహలో వచ్చినా ఎవరు ఇళయరాజా వంటి వారి స్థాయిలో మెప్పించలేకపోయారు. రెండు మూడు సినిమాల్లో కనిపించి మళ్ళీ  వారి ఇండస్ట్రీ కి వెళ్లిపోతున్నారు.

అయితే ఇప్పుడు ఓ కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తెలుగు సినిమాలను ఒకే చేస్తూ.. టాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు లో వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఈ యువకుడు. పవన్ కళ్యాణ్ 25వ చిత్రానికి ఇచ్చిన బాణీలకు త్రివిక్రమ్ ఫిదా అయిపోయి.. తను తీయబోయే నెక్స్ట్ సినిమాకు కూడా అనిరుధ్ నే ఫిక్స్ చేశాడట. త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు అయిపోగానే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు.  ఎన్టీఆర్ కూడా అందుకు ప్రిపేర్అ వుతున్నాడాట. మరి ఈ యువ సంగీత దర్శకుడిలో మాటల మాంత్రికుడిగా ఎం నచ్చిందో ఏమో గాని కంటిన్యూగా రెండు సినిమాలకు ఫిక్స్ చేసుకున్నాడు.

అసలైతే "అఆ" సినిమాకు కూడా అనిరుధ్ నే ముందుగా అనుకున్నారట. కానీ అప్పుడు డేట్స్ కుదరకపోవడం వల్ల అనిరుధ్ నెక్స్ట్ సినిమాకి పక్కా అని చెప్పడంతో మళ్ళీ దొరుకుతాడో దొరకడో అని తన తర్వాత సినిమాకు కూడా ఒకే చేయించుకున్నడు త్రివిక్రమ్ అంటున్నారు సన్నిహితులు. చూద్దాం అఫీషియల్ ప్రకటన రానివ్వండి!!