Begin typing your search above and press return to search.

మరో సీనియర్‌ హీరోయిన్‌ పై త్రివిక్రమ్‌ దృష్టి

By:  Tupaki Desk   |   17 Feb 2019 6:41 AM GMT
మరో సీనియర్‌ హీరోయిన్‌ పై త్రివిక్రమ్‌ దృష్టి
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలను చూస్తే సీనియర్‌ హీరోయిన్స్‌ కు ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నాడు. నదియా, స్నేహా, ఖుష్బు వంటి వారిని తన సినిమాల్లో కీలక పాత్రలకు గాను ఎంపిక చేయడం జరిగింది. ఇటీవల వచ్చిన అరవింద సమేత చిత్రంలో కూడా ఒక సీనియర్‌ హీరోయిన్‌ తో కీలక పాత్రను చేయించిన త్రివిక్రమ్‌ త్వరలో అల్లు అర్జున్‌ హీరోయిన్‌ గా ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

బన్నీతో చేయబోతున్న సినిమాకు గాను సీనియర్‌ హీరోయిన్‌ నగ్మను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కు తల్లి పాత్రలో నగ్మను ఎంపిక చేయడం జరిగిందట. తండ్రి, కొడుకుల నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో తండ్రి పాత్రకు గాను ప్రముఖ నటుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్న త్రివిక్రమ్‌ ఆయనకు సరి జోడీగా అన్నట్లు నగ్మను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు, కాని త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

1980లలో స్టార్‌ హీరోలతో ఒక ఊపు ఊపిన నగ్మ ఆ వుడ్‌ ఈ వుడ్‌ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది. అయితే హీరోయిన్‌ గా ఫేడ్‌ ఔట్‌ అయిన సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాల్లో ఈమె కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో మళ్లీ సినిమాల్లోకి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. నగ్మ నటనకు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్‌ తన సినిమాలో బన్నీ తల్లి పాత్రకు గాను ఆమెను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నదియా, ఖుష్బు, సిమ్రాన్‌ వంటి వారు రీ ఎంట్రీతో కుమ్మేస్తున్నారు. మరి నగ్మ ఎలాంటి ఫలితాలను చవి చూస్తుందో చూడాలి.