Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో మహేష్.. అక్టోబర్లో షూటింగ్

By:  Tupaki Desk   |   28 Sep 2016 11:30 AM GMT
త్రివిక్రమ్ తో మహేష్.. అక్టోబర్లో షూటింగ్
X
మహేష్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తవడానికి ఇంకో మూడు నాలుగు నెలలు పడుతుంది. మహేష్ తర్వాతి సినిమా కమిటైంది కొరటాల శివకు. మరోవైపు త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్టు రాసుకుని.. షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. మరి మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఇప్పుడెలా కలిసింది..? అక్టోబర్లో ఇద్దరూ కలిసి షూటింగ్ ఎలా చేస్తారు..? ఇక్కడే ఓ ట్విస్టుంది.

మహేష్-త్రివిక్రమ్ కలిసి చేసేది సినిమా కాదు. ఓ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ మాత్రమే. ఈ మధ్యే ఓ ఆన్ లైన్ టికెటింగ్ కంపెనీతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు మహేష్ బాబు. వాళ్ల కోసం ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆ యాడ్ కోసం త్రివిక్రమ్ పేరు సూచించాడట మహేష్. ప్రస్తుతం తాను ఖాళీగానే ఉండటం.. పైగా మహేష్ తో యాడ్ కావడంతో ఆ కంపెనీ వాళ్లు అడగ్గానే త్రివిక్రమ్ కూడా ఒప్పేసుకున్నాడట. అక్టోబర్లో ఈ యాడ్ షూటింగ్ ఉంటుందని సమాచారం.

ఇలా కంపెనీలకు ప్రచారం చేసి ఎంతెంత డబ్బులు సంపాదించవచ్చో టాలీవుడ్ హీరోలకు చూపించింది మహేష్ బాబే. ఇంతకుముందు మన హీరోలు యాడ్స్ అంటే తక్కువగా చూసేవాళ్లు. కానీ మహేష్ పదుల సంఖ్యలో బ్రాండ్లకు ప్రచారకర్తగా మారి.. సినిమాల్లో కంటే ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టడంతో అందరూ అతడి బాటలో నడుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ చేతిలో డజను దాకా బ్రాండ్లు ఉండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/