Begin typing your search above and press return to search.

నితిన్‌ కంటే సమంతే నచ్చిందా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 5:36 AM GMT
నితిన్‌ కంటే సమంతే నచ్చిందా?
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడంటే ప్రేక్షకలోకమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అతడు ఎలాంటి కథ ఎంచుకుంటాడు? నటీనటులెవరు? టెక్నికల్‌ అంశాలేంటి?.. వంటి విషయాల్ని ఆరాతీస్తారు. ఇటీవలి కాలంలో అతడు ఎంచుకునే కథాంశాల్లో మోరల్‌ వాల్యూస్‌ కి పట్టంగడుతున్నాడు. బన్ని హీరోగా నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో విలువలే ఆస్తి అంటూ క్లాస్‌ పీకాడన్న విమర్శలొచ్చినా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు. మంచి సందేశం ఇస్తూనే కమర్షియల్‌ హిట్‌ కొట్టొచ్చని నిరూపించాడు.

అందుకే ఈసారి అతడు ఏ సినిమా తీస్తున్నాడు? అన్న ఆసక్తి మునుపటి కంటే రెట్టింపైంది. పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ లతో సినిమా తీస్తాడని భావించినా వీళ్లెవరికీ ఖాళీ లేని పరిస్థితి. అందుకే ఈసారి సమీకరణం మారింది. నితిన్‌ ని హీరోగా ఎంచుకున్నాడు. నితిన్‌ ని ఎంపిక చేసుకునే కంటే ముందే సమంతని కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు. సమంత అతడికి లక్కీ మస్కట్‌. అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అందుకే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తననే ఎంపిక చేసుకున్నాడు.

స్క్రిప్టు రెడీ అవ్వగానే తొలి ఎంపిక సమంత. ఆ తర్వాతే హీరో ఎవరు? అనేది ఆలోచించాడు. అంటే ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్‌ కి అత్యంత ప్రాధాన్యత ఉందన్నమాట! అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్‌ లో సినిమా ప్రారంభించి, 2016 వేసవిలో రిలీజ్‌ చేయనున్నారు.