అజ్ఞాతవాసి బయటకొచ్చాడు

Mon Mar 12 2018 10:24:03 GMT+0530 (IST)

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి రైటరే కాదు.. మంచి వక్త కూడా. ఆయన ప్రసంగం చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది. ఆయన గత స్పీచులు విన్నవారెవరైనా కచ్చితంగా ఇదేమాట చెబుతారు. ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్స్ లో ఆయన మాట్లాడే విధానాన్ని మెచ్చుకునే వాళ్లు చాలామందే ఉన్నారు.తాజాగా టి.సుబ్బిరామిరెడ్డి ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్ కు వచ్చిన త్రివిక్రమ్ తన సహజసిద్ధ స్వభావానికి భిన్నంగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇది. ఆయన అభిమానులను ఆశ్చర్య పరిచింది. అజ్ఞాతవాసి డిజాస్టర్ తరవాత ఆయన అటెండయిన పబ్లిక్ మీటింగ్ ఇదే. అసలు ఆయన ఆ మీటింగుకి వస్తాడనే ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే గెస్టుల్లో ఆయన పేరే లేదు. ఆయన ఎందుకొచ్చి.. ఎందుకు సైలెంట్ ఉన్నాడని చాలామందే ఆరా తీశారు. ఈ మీటింగుకు వచ్చిన బ్రహ్మానందం త్రివిక్రమ్ దగ్గరలోనే ఉన్నాడని తెలిసి.. ఆయనను బలవంతం చేసి మరీ ఈ మీటింగుకు తీసుకొచ్చాడని త్రివిక్రమ్ సన్నిహితులు తెలిపారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కథ కన్నా కథనమే ఎక్కువగా మెప్పిస్తుంది. పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాకే సెట్లోకి అడుగు పెట్టడం ఆయన స్టయిల్. ఎటొచ్చీ ఆయన తాజాగా దర్శకత్వం వహించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ ఏ కోశానా ఆ స్క్రిప్టులో లేదనే విమర్శలు గట్టిగానే వచ్చాయి.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తరవాత ప్రాజెక్టు కోసం సిద్ధమయ్యాడు త్రివిక్రమ్. తనపై వచ్చిన విమర్శలకు ఈ సినిమా స్క్రిప్టుతోనే బదులివ్వాలని త్రివిక్రమ్ గట్టిగానే డిసైడయ్యాడనేది ఆయన సన్నిహితుల మాట. అందుకే పబ్లిక్ మీటింగుకు వచ్చినా సైలెంట్ గా ఉండిపోయాడని అంటున్నారు.