ఫోటో స్టోరీ: హీరో కూతురు.. అంత మేకప్పా

Thu Jun 14 2018 17:58:37 GMT+0530 (IST)

స్టార్ హీరోలకంటే వాళ్ళ పిల్లలకు ఇంకా ఎక్కువ మంది ఫాలోయర్లు ఉంటారు. షారుఖ్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ పిల్లలు ఇక్కడే ఉంటూ కెమెరాలకు కనిపిస్తుంటే వేరే దేశంలో ఉంటూ కూడా మనకు అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటుంది సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్.ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యక్టీవ్ గా ఉండటం మాత్రమే కాక ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం లోటు చూపని ఈమె ఎప్పుడు ఎదో ఒక కొత్త పోజ్ లొనే కనిపిస్తుంది. కాకపోతే ఈసారి పెట్టిన ఒక ఫొటోకు మాత్రం పాజిటివ్ కామెంట్లు కొంత తక్కువే వచ్చాయి. పచ్చ రంగు గౌన్ వేసుకుని మెట్ల మీద కూర్చుని పక్కకి చూస్తూ తన పోనీ టైల్ పట్టుకుని పోజ్ ఇచ్చింది ఈ భామ. అంతా బాగానే ఉంది కాని మొహం దగ్గరే తేడా కొట్టింది.

మేకప్ కొంత వేసుకుంటే కనిపించకుండా అందంగా కనిపిస్తారు. కానీ త్రిషాల మాత్రం మేకప్ మోతాదు కొంచెం ఎక్కువే చేసేసరికి నెటిజన్లు కొంచెం హర్ట్ అయ్యారు. మేకప్ మరీ ఎక్కు అయిపోయింది కాస్త తగ్గించు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా సంజయ్ దత్ కూతురి కొత్త పిక్చర్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.