Begin typing your search above and press return to search.

చచ్చిపోయిన సినిమాను త్రిష బతికిస్తోంది

By:  Tupaki Desk   |   23 Feb 2017 9:56 AM GMT
చచ్చిపోయిన సినిమాను త్రిష బతికిస్తోంది
X
కెరీర్ ముగిసిపోయింది అనుకున్న తరుణంలో ఫీనిక్స్ పక్షిలాగా భలేగా పైకి లేచింది త్రిష. ఆరేడేళ్ల కిందటే ఆమె పనైపోయిందని.. రిటైర్మెంట్ కు త్రిష దగ్గర పడిందని కామెంట్లు విసిరారు జనాలు. కానీ ఆమె భలేగా రైజ్ అయింది. మంచి మంచి అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం త్రిష ఖాతాలో అరడజను సినిమాలున్నాయి. అవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే. కేవలం త్రిషను నమ్ముకుని ఏడెనిమిది కోట్లు పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తున్నారంటే ఆమె స్థాయి ఏంటో అంచనా వేయొచ్చు. విశేషం ఏంటంటే.. ముగిసిందనుకున్న తన కెరీర్ ను త్రిష ఎలా పట్టాలెక్కించిందో.. ఇక లేదు అనుకున్న సినిమాను కూడా అలాగే బతికించింది త్రిష.

తమిళంలో .. అనే దర్శకుడు మూడేళ్ల కిందట ‘1818’ పేరుతో ముంబయి దాడుల నేపథ్యంలో ఒక థ్రిల్లర్ మూవీని మొదలుపెట్టాడు. ఇది తమిళ.. తెలుగు భాషల్లో తెరకెక్కాల్సిన సినిమా. ‘శంభో శివ శంభో’ సినిమాలో కీలక పాత్ర పోషించిన అభినయ (ఈ అమ్మాయికి మాటలు రావు) ఇందులో కథానాయిక. రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం.. సుమన్ లను కీలక పాత్రలకు తీసుకున్నారు. కానీ ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఐతే ఈ మధ్యే ఆ దర్శకుడు త్రిషకు కథ వినిపించగా.. ఆమె థ్రిల్లయిపోయి తాను ఈ సినిమా చేస్తానని ఒప్పుకుంది. దీంతో ‘1818’ మళ్లీ పట్టాలెక్కింది. షూటింగ్ జరుపుకుంటోంది. ముంబయి ఉగ్రవాదుల దాడిలో నారీమన్ హోటల్లో జరిగిన విధ్వంసం గురించి తెలిసిందే. ఈ కథ ఆ హోటల్ నేపథ్యంలోనే సాగుతుంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/