Begin typing your search above and press return to search.

త్రిషకు మరో సూపర్ ఛాన్స్

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:30 AM GMT
త్రిషకు మరో సూపర్ ఛాన్స్
X
తెలుగులో లక్ష్మీ నరసింహ అంటూ బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ పాత్రతో ఓ సినిమా చేశారు. ఇది విక్రమ్ నటించిన తమిళ్ 'సామి'కి రీమేక్. ఇప్పుడీ సామికి సీక్వెల్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 13 ఏళ్ల క్రితం సామిని తీసిన దర్శకుడు హరి.. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన స్టోరీ వర్క్ ఫినిష్ చేసి.. సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.

తమిళ్ సామిలో హీరోయిన్ గా త్రిష నటించింది. ఇప్పుడు సామి2 లో కూడా త్రిషనే తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే.. కెరీర్ ఎండింగ్ లో ఆమెకు బంపర్ ఆఫర్ తగిలినట్లే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒకటీ అరా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తప్ప త్రిష చేతిలో ఏమీ లేవు. అయితే.. త్రిషను హీరోయిన్ గా తీసుకోవడంపై ఇంకా ఫైనలైజ్ చేయలేదంటున్నాడు దర్శకుడు హరి. కానీ ఆప్షన్ మాత్రం పరిశీలనలో ఉందనే అంటున్నాడు.

సామి2 లో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా.. ఒక హీరోయిన్ గా గత సినిమాలో నటించిన త్రిష ఉంటుందని.. మరో హీరోయిన్ గా నయనతారను ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్యతో సింగం3 తీస్తున్న దర్శకుడు హరి.. అది పూర్తయిన వెంటనే.. సెప్టెంబర్ చివర్లో సామి2ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.