Begin typing your search above and press return to search.

త్రిష.. హన్సిక.. ఈ ట్వీట్లేందో!!

By:  Tupaki Desk   |   30 July 2016 4:02 AM GMT
త్రిష.. హన్సిక.. ఈ ట్వీట్లేందో!!
X
ఇప్పుడు తమిళ హీరోయిన్లందరికీ ఒకే రకం ఆఫర్లు వస్తున్నాయి. ఒక ప్రక్కన సినిమాల్లేక ఖాళీగా ఉన్నా కూడా సినిమాల్లో ఛాన్సులు ఎవ్వరూ ఆఫర్ చేయట్లేదు కాని.. సినిమాల గురించి మాట్లాడమని మాత్రం ఆఫర్లు వచ్చేస్తున్నాయి. అయితే వీరు ఈ ప్రచారం కేవలం సరదా కోసం చేస్తున్నారా లేకపోతే పేమెంట్లు ఏమన్నా ముడుతున్నాయో తెలియదు.

మ్యాటర్ ఏంటంటే.. మొన్నటివరకు తమిళంలో తెగ సినిమాలే ఉన్నట్లు కనిపించినా కూడా.. ఇప్పుడు త్రిష అండ్ హన్సిక ఫుల్లుగా ఖాళీ అయిపోయారు. ఏదో ఒకటో అర సినిమాలు రిలీజుకు రెడీగా ఉన్నాయంతే. అయితే ఈ ముద్దుగుమ్మలు మాత్రం వేరే సినిమాల ఫస్టు లుక్కు పోస్టర్లనూ ట్రైలర్లనూ ట్విట్టర్లో ఫేసుబుక్కులో రిలీజ్ చేస్తూ బిజీగా ఉన్నారు. మొన్న హన్సిక.. సందీప్ కిషన్‌ హీరోగా రూపొందిన మాయావన్ సినిమా తొలిపోస్టర్ ను విడుదల చేసింది. సందీప్ తొలిసారిగా తమిళంలో పోలీసు పాత్రలో కనిపిస్తున్న మూవీ ఇదే. త్రిష విషయానికొస్తే.. నిన్న 'బ్రూస్ లీ' ఫేం విలన్ అరుణ్‌ విజయ్ హీరోగా నటించిన కుట్రం 23 సినిమా ఫస్టు లుక్కును విడుదల చేసింది. ఈ సినిమాలో వెట్రిమారన్ ఐపిఎస్ పాత్రలో నటిస్తున్నాడు ఇతగాడు.

మామూలుగా అయితే తమన్నా - తాప్సీ - రానా ఇలా అందరూ కూడా ఏదైనా వస్తువు గురించి ట్వీట్లు వేయాలంటే మాత్రం డబ్బులు తీసుకుంటారు. అదొక రకమైన అడ్వర్టయిజింగ్. మరి సినిమాల పోస్టర్ల కోసం తీసుకుంటారో లేదో తెలియదు. ఏమంటారు త్రిష - హన్సిక? సంఘ సేవా లేకపోతే పాకెట్ మనీ వస్తోందా?