త్రిష.. ఆశ ఫలించేనా??

Wed Oct 11 2017 14:36:58 GMT+0530 (IST)


వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన భామ త్రిష. అమ్మడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 ఏళ్లు అవుతోంది. సాధారణంగా ఈ రోజుల్లో హీరోయిన్లు ఒక ఐదేళ్లు ఉంటేనే చాలా గొప్ప కానీ త్రిష మాత్రం తన అందంతో ఇంకా ఆకట్టుకుంటూనే ఉంటుంది. సౌత్ లో దాదాపు బడా హీరోలందరితోను అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. మూడు పదుల వయసు దాటినా ఇంకా అందంలో యువ హీరోయిన్లకు పోటీని ఇస్తోంది.  తెలుగులో ప్రస్తుతం అంతగా అవకాశాలు రాకపోయినా కోలీవుడ్ లో మాత్రం తన ఇమేజ్ ను ఒక లెవెల్ లో మెయింటేన్ చేస్తోంది. ప్రస్తుతం తమిళ్ సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయితే ఏ విధంగా నేర్చుకుందో గాని నిర్మాతగా మారాలని డిసైడ్ అయ్యిందట త్రిష. ఒక కొత్త తరహా కథతో త్వరలోనే తెలుగు తమిళ్ లో ఒక సినిమాను తనే నిర్మించి లీడ్ రోల్ లో నటించడానికి రెడీ అవుతోందట త్రిషా. అంతే కాకుండా తను స్థాపించిన ప్రొడక్షన్ ను రిటైర్మెంట్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇదే తరహాలో కొందరు హీరోయిన్లు వారే నిర్మాతగా మారి సినిమాలను నిర్మించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా సినిమాలను నిర్మించి సక్సెస్ ను అందుకుంది. అయితే సౌత్ హీరోయిన్స్ మాత్రం ఇంతవరకు అలాంటి ప్రయోగాల్లో సక్సెస్ అవ్వలేదు. మరి ఈ చెన్నై భామ ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.