Begin typing your search above and press return to search.

నాన్న కల నెరవేరుస్తున్న త్రిష

By:  Tupaki Desk   |   24 Oct 2016 9:30 AM GMT
నాన్న కల నెరవేరుస్తున్న త్రిష
X
ఇప్పటి సినీ తారలు ఒకప్పటి వాళ్లలా కాదు. కెరీర్ ప్లానింగ్ విషయంలో చాలా పక్కాగా ఉంటున్నారు. డబ్బుల్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓవైపు సినిమాల్లో కొనసాగుతూనే.. మరోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విషయంలో హీరోయిన్లు రెండాకులు ఎక్కువే చదివేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు-తమిళ భాషల్లో లీడింగ్‌ లో ఉన్న హీరోయిన్లందరూ సినిమాల్లో కొనసాగుతూనే వేరే వ్యాపారాలూ చేస్తున్నారు. ఈ జాబితాలోకి త్రిష కూడా చేరుతోంది.

త్రిష త్వరలోనే వ్యాపార రంగంలోకి అడుగుపెడుతోంది. ఆమె బెంగళూరులో ఒక స్టార్ హోటల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుండటం విశేషం. 60 లగ్జరీ సూట్లు.. గదులతో ఈ స్టార్ హోటల్ నిర్మితమవుతున్నట్లు సమాచారం. బెంగళూరు లాంటి సిటీలో ఆ మాత్రం హోటల్ పెట్టాలంటే పెట్టుబడి భారీగానే ఉండాలి. మరి త్రిష సొంతంగా పూర్తి ఇన్వెస్ట్‌మెంట్ పెడుతోందా.. ఎవరైనా బడా ఇన్వెస్టర్‌ ను తీసుకొచ్చిందా అన్నది తెలియదు.

త్రిష ఏరి కోరి ఈ స్టార్ హోటల్ బిజినెస్‌ లోకి రావడానికి ఓ కారణముంది. ఆమె తండ్రి ఒకప్పుడు ఒక స్టార్ హోటల్లో పని చేశాడు. ఆయన స్వయంగా ఒక పెద్ద హోటల్ నడపాలని ఆశపడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. ఈ నేపథ్యంలోనే త్రిష తన తండ్రి జ్నాపకార్థం ఈ హోటల్ పెడుతోంది. మరి ఈ బిజినెస్‌‌లో ఆమె ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/