Begin typing your search above and press return to search.

ఆ త్రిషను టచ్ చెయ్యకండయ్యా!!

By:  Tupaki Desk   |   1 Aug 2015 3:31 PM GMT
ఆ త్రిషను టచ్ చెయ్యకండయ్యా!!
X
అదిగో మనోళ్ళకి చెప్పండి.. ఆ త్రిష ను మాత్రం టచ్ చెయ్యకండి. మామూలుగా సెలబ్రిటీస్ అందరు పర్సనల్ లైఫ్ గురించి బయట మాట్లాడాల్సిన అవసరం లేదంటారు. త్రిష కూడా సేమ్ టూ సేమ్. పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే అమ్మడు ఆ పర్సనల్ లైఫ్ కాస్త రప్చర్ అయితే మాత్రం ఇక జనాలకు పబ్లిక్ లో క్లాసులు పీకుతూ వుంటుంది.

తాజాగా ఓ త్వీట్ వేసింది త్రిష. అమ్మడు తన జీవితంలోకి వచ్చిన ఒక న్యూ మార్పు గురించి చెప్పుకొచ్చింది. కొత్తగా ఇప్పుడు ఒక రూల్ పెట్టుకుందట. "అన్ ఫ్రెండ్ చెయ్యడం, ఇగ్నోర్ చెయ్యడం, బ్లాక్ చెయ్యడం వంటివి ఇకనుండి విరివిగా చేస్తాను. నెగటివ్ గా మాట్లాడినా, సటైర్స్ వేసిన కట్ కట్ కట్. ఈ రూల్స్ అందరికి వర్తిస్తాయి" అంటూ చెప్పుకొచ్చింది సాంబార్ బేబీ. ఇంతకీ ఇప్పుడు కొత్తగా నువ్వొక స్కూల్ తెరిచి మళ్లీ దీనికి ఈ రూల్స్ పెట్టుకొనే అవసరం ఏమొచ్చింది త్రిషా??

నిజానికి వరుణ్ మనియన్ తో మ్యారేజ్ బ్రేకప్ చేసుకున్నాక అసలు త్రిష ఎవరిని చేస్కుంటుంది, ఎవరితో మల్లి ఎఫైర్ పెట్టుకొనే ఛాన్స్ వుంది, తిరిగి ఒక మాజీ ప్రియుడుతోనే మళ్లీ పట్టాలు ఎక్కేస్తోందా అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. ఒక వేళ వాటిగురించి ఎవరైనా అడిగినందుకు ఇలా విరుచుకు పడిందా? అయిన అలాంటి విషయాలు త్రిష రివీల్ చెయ్యకపోయినా మనకు ఇట్టే తెలిసిపోతాయిలే. చిన్నపటి నుండి చూస్తున్నాం త్రిష నిన్ను.. అయినాసరే ఆ త్రిషను టచ్ చెయ్యకండి బాసు.. వదిలేయండి.