Begin typing your search above and press return to search.

బాగా లేటయ్యావ్ త్రిష!!

By:  Tupaki Desk   |   11 Aug 2017 1:01 PM GMT
బాగా లేటయ్యావ్ త్రిష!!
X
సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు అంటే.. శ్రీయ అండ్ త్రిష అంటూ రెండు పేర్లు వినిపించేవి. వీరలో శ్రీయ ముందుగానే స్టార్డమ్ నుండి విడాకులు తీసుకుంది. రెండు మూడు రాంగ్ సినిమాలు చేయగానే వెంటనే అమ్మడిని పక్కనెట్టేశారు. కాకపోతే సౌత్ లో ఉన్న తెలుగు తమిళ ఇండస్ర్టీల్లో పెద్ద స్టార్లందరితోనూ హీరోయిన్ గా చేసింది. అలాగే త్రిష కూడా అందరితోనూ నటించింది. కాని ఓ ఐదారేళ్ళ క్రితం స్టార్డమ్ కు దూరమైంది. అప్పటినుండి అసలు పెద్ద సినిమాలే పడట్లేదు.

తెలుగులో దమ్ము.. లయన్ సినిమాలతో త్రిష మాయమైపోయినట్లే అని చెప్పాలి. అవే ఆమెకు ఆఖరి పెద్ద హీరోల సినిమాలు. అయితే ఇప్పుడు త్రిష తిరిగి తెలుగు పెద్ద స్టార్లకు దగ్గరవ్వడానికి తెగ ప్రయత్నిస్తోంది. నిన్న ఆగస్టు 10 అంటే.. ''అతడు'' సినిమా విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు. ఆ సినిమాలో చేసిన పూరి పాత్రను ఇంకా మరచిపోలేకపోతున్నానని.. అతడు ఒక క్లాసిక్ అని.. అలాగే ఆ సినిమాలో తనతో చేసిన మహేష్‌ బాబు ఒక బెస్ట్ కో-స్టార్ అంటూ పొగిడేసింది. అమ్మడి పొగడ్తలు ఎలా ఉన్నా కూడా.. ఇలా ఇప్పుడు అతడు సినిమాను తలుచుకునేపాటికే జరగాల్సింది జరిగిపోయింది. త్రిషకు అన్ని ఆఫర్లు మిస్సయిపోయాయ్. బాగా లేటయ్యావ్ త్రిష.

ఇకపోతే ఇప్పుడు తమిళంలో అరవింద్ స్వామి సరసన చేస్తున్న సెతురంగ వేట్టై 2 వంటి సినిమాలు అమ్మడు చేతిలో చాలానే ఉన్నాయిలే. పెద్ద హీరోలు కాకపోయినా.. చిన్న హీరోలు ఆమెను ఇంకా బాగానే పట్టించుకుంటున్నారు. అది సంగతి.