ఎర వేస్తున్న సీనియర్ భామ

Thu Oct 12 2017 18:06:49 GMT+0530 (IST)

ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు పదిహేనేళ్ళు అవుతున్నా సౌత్ బ్యూటీ త్రిషా మాత్రం ఇంకా అదే అందంతో ఆకర్షిస్తోంది. సాధారణంగా ఎవరైనా సరే వయసు పెరుగుతున్న కొద్దీ వారి అందం ఎంతో కొంత చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఈ చెన్నై భామ మాత్రం అదే ఆకృతితో ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తోంది. చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు త్రిష ఫిట్ నెస్ గురించి బాగానే మాట్లాడుకుంటున్నారట.అయితే అంత అందం ఉన్న త్రిషకు గత కొంత కాలంగా అవకాశాలు వస్తున్నా మళ్లీ తన గత వైభవాన్ని చూపడం లేదు. ఎదో చిన్న చిన్న సినిమాలను చేస్తూ.. ఇంకా కెరీర్ మీద ఆశలు వదులుకోవడం లేదు. అయితే రీసెంట్ గా ఏమనుకుందో ఏమో గాని ఎప్పుడు లేని విధంగా హాట్ ఫొటో షూట్స్ తో రచ్చ చేసింది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో అమ్మడు ఏ సినిమాలో కూడా అంత ఘాటుగా కనిపించలేదు. కాని గలట్టా మ్యాగజైన్ కోసం ఈమె దారపోసిన అందం అంతా ఇంతా కాదనే చెప్పాలి.

ఇప్పటివరకు సౌత్ లో చాలా మంది బిగ్ స్టార్స్ తో త్రిష ఆడిపాడింది. అయితే మరోసారి వారితో నటించేందుకు ఈ విధంగా హీటు పెంచిందనే అనుకోవచ్చు. ముఖ్యంగా తమిళంలో అయితే ఓ నాలుగైదు చిన్న సినిమాలు ఉన్నాయి కాని.. తెలుగులో అవి కూడా లేవు. అందుకే ఇలా ఎర వేస్తోందీ సీనియర్ భామ అంటున్నారు సినీ ప్రియులు.