Begin typing your search above and press return to search.

ఏంది త్రిషా.. ఎన్ని సంతకాలు పెడతావ్!?

By:  Tupaki Desk   |   22 Oct 2016 9:30 AM GMT
ఏంది త్రిషా.. ఎన్ని సంతకాలు పెడతావ్!?
X
ఓ ఏడాది క్రితం చెన్నై బ్యూటీ త్రిష స్లో అవడం చూసి.. ఇక అమ్మడి కెరీర్ పరిస్థితి ఆఖరి దశకు చేరుకుందనే కామెంట్స్ వచ్చాయ్. అదే సమయంలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు సంతకం చేయడంతో.. హీరోలెవరూ ఛాన్సులు ఇవ్వడం లేదంటూ జోకులు వేశారు చాలామంది. కానీ కొన్ని నెలల సమయంలోనే అమ్మడు సైన్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తే.. కొత్తగా వచ్చిన కుర్ర భామలకు కూడా కుళ్లు పుట్టడం ఖాయం.

2002లో కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష కృష్ణన్ కి.. ఇప్పుడు చేతినిండా సినిమాలున్నాయి. తాజాగా కోలీవుడ్ యంగ్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేసేందుకు సంతకం పెట్టిందట త్రిష. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడు మారుతున్న ప్రేమ్ కుమార్ సి ఈ చిత్రాన్ని తీయనున్నాడు. కుర్ర హీరోతో సీనియర్ బ్యూటీ.. కాంబినేషన్ బాగానే ఉంటుందికానీ.. దీని కంటే ముందు త్రిష చేతిలోనే చాలానే సినిమాలున్నాయి. వీటన్నిటిలోకి ముందుగా ధనుష్ చేసిన 'కోడి' రిలీజ్ కానుంది. 'చతురంగ వేట్టై2' లో అరవింద్ స్వామికి జోడీగా నటించబోతోంది. 'మోహిని' అంటూ హారర్ మూవీ ఒకటి ఫైనల్ స్టేజ్ లో ఉన్న సంగతి తెలిసింది.

చియాన్ విక్రమ్ తో 'సామి2'లో కూడా యాక్ట్ చేయనుందీ చెన్నై చిన్నది. బాలీవుడ్ మూవీ ఎన్ హెచ్10కి తమిళ్ రీమేక్ గా 'గర్జనై' రూపొందుంతుంటే.. అందులో హీరోయిన్ కూడా ఈమే. 'భోగి' అనే ఫిమేల్ సింట్రిక్ సినిమా మూడేళ్ల క్రితం మొదలై వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. రేవతి డైరెక్షన్ లో రూపొందనున్న బాలీవుడ్ 'క్వీన్' రీమేక్ కి కూడా ఆప్షన్ త్రిషనే. ఇలా చేతిలో 8 సినిమాలు పెట్టుకుని తన రేంజ్ చెప్పకనే చెప్పేసింది త్రిష.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/