Begin typing your search above and press return to search.

15 ఏళ్ల నుండి అవే సెక్సీ అందాలు

By:  Tupaki Desk   |   13 Dec 2017 10:42 AM GMT
15 ఏళ్ల నుండి అవే సెక్సీ అందాలు
X
వయసు ఎంత పెరిగినా అందం మాత్రం తగ్గని హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా ? అంటే ప్రస్తుత హీరోయిన్స్ లో త్రిష ఉందని చెప్పాలి. అమ్మడి మొదటి సినిమాకు ఇప్పటికి అందంలో ఏ మాత్రం తేడా రానివ్వకుండా కరెక్ట్ గా గ్లామర్ ని మెయింటైన్ చేస్తోంది. మూడు పదుల వయసొచ్చినా ఇంకా పాతికేళ్ల హీరోయిన్ లనే కనిపిస్తోంది. ఆమెను చూస్తున్న ఇప్పటి హీరోయిన్స్ చాలా షాక్ అవుతున్నారట. ఇవాల్టికి ఆమె సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అయినా కూడా.. ఇంకా వన్నెతరగని గ్లామర్ ఆమె సొంతమా అంటే.. అవుననే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

మేము ఎంత కష్టపడినా త్రిష రేంజ్ లో గ్లామర్ తో ఆకట్టుకోలేము అని చెబుతున్నారట కొందరు హీరోయిన్స్. అమ్మడు తన కెరీర్లో అన్ని భాషల్లో సినిమాలను తీసింది. ఇక ప్రస్తుతం మలయాళంలో హే జూడ్ అనే మూవీని చేస్తోంది. ఆ సినిమాలో నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్నాడు. మ్యూజికల్ రొమాంటిక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిష కొంచెం గ్లామర్ అందాలతో బాగానే రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలోని కొన్ని ఫొటోస్ ని చూస్తుంటే అమ్మడు చాలా సెక్సీగా ఉందే అనిపిస్తోంది.

ఫొటోల్లోని సొగసులు ఈ రేంజ్ లో ఉంటె ఇక సినిమాలో మొత్తంగా చూస్తే కుర్రకారు తట్టుకోవడం కష్టమనే అంటున్నారు. షార్ట్ జీన్స్ తో సముద్రపు అంచున హాట్ గా ఉన్న త్రిష.. మరో ఫొటోలో హీరోను రొమాంటిక్ గా చూస్తూ కొంచెం హాట్ గా కనిపించింది. ఇప్పటివరకు ఆ సినిమాకు సంబదించిన ప్రతి ఫొటోలో అమ్మడు కొంచెం హాట్ గానే కనిపించిందని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.