త్రిష మళ్ళీ పెళ్ళి వైపే చూస్తోందా??

Thu May 17 2018 11:47:54 GMT+0530 (IST)

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నటీమణులు పెళ్లిళ్లు చక చక జరిగిపోతున్నాయి. వారం ముందు ఫిక్స్ చేసుకొని రెండు రోజుల్లో పెళ్లి తంతు ముగించేస్తున్నారు. అయితే పెళ్లికి ముందు ఆ విషయాన్ని హీరోయిన్స్ చాలా సీక్రెట్ గా ఉంచడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పైగా మీడియాకు పర్మిషన్ ఇవ్వకుండా చాలా సీక్రెట్ గా కానిచ్చేస్తున్నారు. ఇటీవల సోనమ్ కపూర్ - నేహా ధూపియ మ్యారేజ్ చాలా సీక్రెట్ గా జరిగిపోయింది.ఇక శ్రియ పెళ్లి చేసుకున్న తరువాత గాని ఆమె అభిమానులకు విషయం తెలియలేదు. అంతకుముందు షాపింగ్ లతో బిజీ బిజీగా గడిపినా తన ఫ్రెండ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు కవర్ చేసింది. కానీ పెళ్లి జరిగాక గాని అసలు మ్యాటర్ తెలియలేదు పెళ్లి ఆమెదే అని. ఇక ఈ మధ్య మరో సీనియర్ హీరోయిన్ కూడా అదే తరహాలో కవరింగ్ ఇస్తుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఎవరో కాదు.. త్రిష. ఈ 35 ఏళ్ల బ్యూటీ గత కొంత కాలంగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఓ బిజినెస్ మ్యాన్ తో మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని టాక్ వచ్చినప్పటికి త్రిష తల్లి అంతా అబద్ధం అని చెప్పింది.

కానీ త్రిష మాత్రం విదేశాలకు వెళ్లి మరీ షాపింగ్స్ చేస్తుండడంతో వెడ్డింగ్ కి సంబంధించిన షాపింగ్ అయ్యి ఉంటుందని టాక్ వస్తోంది. మరో రెండు మూడు నెలల్లో త్రిష పెళ్లి కూతురు అవ్వబోతోంది అని రూమర్స్ రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం త్రిష చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. కోలీవుడ్ లో మూడు ముఖ్యమైన సినిమాల షూటింగ్స్ ను అమ్మడు ముందుగానే పూర్తి చెసుకుండట. ఇక మరో రెండు సినిమాల పనులు కూడా పూర్తయితే పెళ్లి ఘడియలు మొదలైనట్లే అని టాక్. గతంలో ఓసారి వరుణ్ మనియన్ తో ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక త్రిష తన పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.