Begin typing your search above and press return to search.

త్రిషకు మరో డిసప్పాయింట్‌ మెంట్‌

By:  Tupaki Desk   |   2 Aug 2015 1:39 PM GMT
త్రిషకు మరో డిసప్పాయింట్‌ మెంట్‌
X
క్యూట్‌ త్రిషకు అన్నీ అనుకోని ఉత్పాతాలే. వ్యక్తిగత జీవితంలో వైఫల్యం ఓవైపు, వృత్తిగత జీవితంలో పరాజయాలు మరోవైపు ముప్పిరి గొలపకుండా చేస్తున్నాయి. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవుతున్నాయి. ఇటీవలే బాలయ్యబాబు సరసన నటించిన లయన్‌ ఘోరపరాజయం చవిచూసింది. ఇంతలోనే జయం రవి సరసన నటించిన తమిళ చిత్రం కూడా అదే తీరుగా అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా చెత్తగా ఉందంటూ తమిళ క్రిటిక్స్‌ ఏకి పారేశారు. 2.5 కామన్‌ రేటింగు ఇచ్చి .. బాలేదని రాసుకొచ్చారు. సినిమా టైటిల్‌ సకలకళావల్లవన్‌. టైటిల్‌ ఈ సినిమాకి పెద్ద నెగెటివ్‌ అంటూ విమర్శలొస్తున్నాయి.

అలాగే ఈ చిత్ర కథాంశం వినడానికి ఆసక్తి కలిగించేలా ఉందని టాకొచ్చింది. ఓ అందమైన అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే తండ్రి కోరిక మేరకు వేరొక అమ్మాయిని పెళ్లాడుతాడు. మనసిచ్చిన మగువకు దూరమై మనోవేదనతో భార్యకు దగ్గరవ్వలేకపోతాడు. దాంతో భార్య విడాకులు కోరుతుంది. అలా ఆ బంధం వీగిపోతుంది. జయం రవి ఆ కుర్రాడు అయితే అతడిని పెళ్లాడే అమ్మాయిగా త్రిష నటించింది. ప్రేయసి పాత్రలో అంజలి నటించింది. అయితే ఈ చిత్రంలో త్రిష, అంజలి పాత్రలు క్లయిమాక్స్‌ లో రియలైజ్‌ అయ్యి జయం రవికి ఫేవర్‌ అవుతాయి. చివరికి తండ్రి (ప్రభు) కళ్లు తెరిపించే ఎపిసోడ్‌ తో ఎండ్‌ అవుతుంది. ఏదేమైనా ఈ చిత్రం త్రిషకు నిరాశనే మిగిల్చిందని చెబుతున్నారు.