Begin typing your search above and press return to search.

అది హిట్టయితే త్రిష చేతిలో పెట్టేవారట

By:  Tupaki Desk   |   27 July 2016 3:50 AM GMT
అది హిట్టయితే త్రిష చేతిలో పెట్టేవారట
X
సినిమా ఇండస్ర్టీలో అంతే. ఒకటి హిట్టయితేనే తరువాత ఛాన్సులు ఉండేది. ఈ శుక్రవారం ఫ్లాపు కొడితే.. వచ్చే శుక్రవారం నాటికి చేతిలో ఉన్న ఆఫర్లన్నీ ఎగిరిపోతాయ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ గా ఎవరైనా హిట్ లేని స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ యాంగిల్లో చూస్తే.. మెగాస్టార్ దగ్గరుంది రెండే రెండు ఆప్షన్లు. ఒకటి శ్రీయ.. ఇంకోటి త్రిష. కాకపోతే బాలయ్యతో శాతకర్ణి భార్యగా ఆల్రెడీ ఢిల్లీ బెల్లీ శ్రీయ రంగంలోకి దిగింది కాబట్టి.. ఖచ్చితంగా త్రిష ఈజ్‌ ది ఓన్లీ ఆప్షన్‌. కాని ఆమె ఆ ఛాన్సును మిస్సయిపోయింది. లేదు లేదూ.. చేజేతులారా తానే మిస్ చేసుకుంది.

నిజానికి 'నాయకి' సినిమా హిట్టయితే మాత్రం.. త్రిష రేంజు ఇంకోలా ఉండేది. ఇప్పటికే స్టాలిన్‌ సినిమాలో ఆల్రెడీ చిరంజీవి హీరోయిన్ గా పనిచేసిన త్రిషను మరోసారి తీసుకునేవారట. ఆ మేరకు డిస్కషన్లు కూడా జరిగినట్లు తెలుస్తోందిలే. కాని నాయకి కోసం అసలు ఈ చెన్నయ్ బేబీ కనీసం ప్రమోషన్లు కూడా చేయకపోవడం.. అందులోనూ సినిమాకు మినిమంలో మినిమం అయినా టాక్‌ రాకపోవడం.. ఆమె గ్లామరసం గురించి కూడా ఎవ్వరూ డిస్కస్ చేయకపోవడం.. ఇవన్నీ ఈమె ఛాన్సులను దెబ్బేశాయి. నాయకి రిజల్టు చూసిన వివి వినాయక్‌.. త్రిష వద్దులేండి మాష్టారూ అంటూ ఫిక్సయిపోయాడని ఫిలిం నగర్‌ టాక్‌. అదే ఆ సినిమా ఆడుంటే మాత్రం.. 150వ సినిమాలో అమ్మడు కుమ్మేసేది. అవతల తన స్నేహితురాలు బాలయ్య 100లో.. ఈమె ఇందులో.. అదిరేది!!