Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నీటిలో ఆ నటి అందాలు

By:  Tupaki Desk   |   11 Dec 2017 6:13 AM GMT
ఫోటో స్టోరి: నీటిలో ఆ నటి అందాలు
X
త్రిధా చౌదరి అనే పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నార్త్ భామ ఇస్తోన్న సోకుల షాకులు అలా ఉన్నాయి మరి. బెంగాలీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సూర్యా వర్సెస్ సూర్య సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన త్రిదా మొదట్లో కొంచెం డీసెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ రెండు సినిమాలకే బికినీ అందాలకు బాగా అలవాటు పడిపోయింది. స్వీట్ లవ్ స్టోరీలను ఎంచుకుంటూనే బాయట మాత్రం హాట్ గ్లామర్ అందాలతో రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియా ఫాలోవర్స్ ని కూడా బాగానే పెంచేసుకుంటోంది. కానీ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటోను చూస్తుంటే ఎంతో కూల్ గా బికినీ అందాలతో దర్శనం ఇచ్చింది. నీళ్లల్లో ఎదో ధ్యానం చేస్తున్నట్టు స్టీల్ ఇచ్చి అందమైన చిరునవ్వును కూడా లైట్ గా యాడ్ చేసింది. బ్లూ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఎవరి స్టైల్ లో వారు ఫొటో షూట్స్ కి పోజులను ఇస్తుంటే అమ్మడు మాత్రం ఏకంగా నీటిలోనే స్టీల్ ఇచ్చి ఫాలోవర్స్ కి ఓ కిక్కును ఇస్తోంది.

ఆఫర్స్ ఎక్కువగా లేకపోయినా త్రిదా మాత్రం ఈ రకంగా తన ఇమేజ్ ను బాగానే పెంచుకుంటోంది. రీసెంట్ గా ఒక హిందీ టీవీ సీరియల్ లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'మనసుకు నచ్చింది' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.