Begin typing your search above and press return to search.

రెచ్చిపోతున్న నిఖిల్ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   19 April 2018 10:26 AM GMT
రెచ్చిపోతున్న నిఖిల్ హీరోయిన్‌
X
త్రిధా చౌద‌రి అన‌గానే ఎవ‌రికి వెంట‌నే గుర్తుకురాక‌పోవ‌చ్చు కానీ సూర్య వ‌ర్సెస్ సూర్య హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుప‌ట్టేస్తారు. ఆ సినిమాలో వింత వ్యాధి ఉన్న నిఖిల్ ప‌క్క‌న చ‌క్క‌గా న‌టించింది త్రిధా. ఆ సినిమా త‌రువాత తెలుగులో పెద్ద‌గా క‌నిపించ‌లేదు త్రిధా. మొన్నీమ‌ధ్య విడుద‌లైన మ‌న‌సుకు న‌చ్చిందిలో మాత్రం గ్లామ‌ర‌స్ గా మెరిసింది త్రిధా. తాజాగా హాట్ హాట్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చి రెచ్చిపోతోంది.

మంజుల ఘ‌ట్ట‌మ‌నేని తీసిన మ‌నసుకు న‌చ్చిందిలో త్రిధా పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో బాగానే అందాల విందు చేసింది. ఆ విందును కొన‌సాగిస్తూ ఇదిగో ఇప్పుడు టు పీస్ డ్రెస్సులో హాట్‌గా ఫోటోకు ఫోజిచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయి కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. కాళ్ల‌కి హైహీల్స్‌తో చెవిపైన పూవుతో... కైపెక్కించే చూపుతో త్రిధా క‌ట్టిప‌డేస్తోంది. ఎంత‌గా రెచ్చిపోయి అందాల‌ను ఆర‌బోస్తున్న చేతికొచ్చే సినిమాలు మాత్రం త‌క్కువే. ఈ ఫోటో అయినా త్రిధాకు అవ‌కాశాలు తెచ్చిపెడుతుందో లేదో.

గ‌తంలో బీచ్ ఒడ్డున మోకాళ్ల లోతులో దిగిన ఫోటోను పోస్టు చేసింది త్రిధా. హాట్ స్విమ్‌సూట్‌లోని ఆ ఫోటోను చూసి అబ్బా అనుకున్నారే కానీ ఒక్క ద‌ర్శ‌కుడు నిర్మాత ఛాన్సులు మాత్రం ఇవ్వ‌లేదు. ఏవో చిన్నా చిత‌కా పాత్ర‌లు వ‌స్తుంటే స‌ర్దుకుపోతోంది ఈ హాట్ భామ‌.