Begin typing your search above and press return to search.

బికినీలో అందంగా ఉంటాను తెలుసా

By:  Tupaki Desk   |   17 Jan 2018 4:56 AM GMT
బికినీలో అందంగా ఉంటాను తెలుసా
X
నిఖిల్ హీరోగా నటించిన సూర్య వెర్సస్ సూర్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ త్రిథా చౌదరి. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం.. ఇక్కడ తగిన గుర్తింపు రాకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. మహేష్ బాబు సోదరి మంజుల డైరెక్ట్ చేస్తున్న మనసుకు నచ్చిందిలో హీరోయిన్ గా అవకాశం రావడవతో మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షింకోవడానికి రెడీ అవుతోంది.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మనసుకు నచ్చింది మూవీలో త్రిథాది ఫుల్ లెంగ్త్ గ్లామర్ రోల్. ఈ సినిమాలో బికినీ సీన్లలో కూడా నటించింది. గ్లామర్ పాళ్లు పుష్కలంగా ఉన్న భామ కావడంతో ఇందులో బికినీతో కనిపిస్తోందనే న్యూస్ బాగానే వైరల్ అయింది. ముందు తాను బికీనీ సీన్ చేయడానికి కాస్త వెనుకాడానని.. తరవాత డైరెక్టర్ మంజూల ఈ సీన్ ప్రాధాన్యం గురించి చెప్పేసరికి ఒప్పుకున్నానని అంటోంది త్రిధ. ‘‘ఇందులో నా పాత్ర పేరు నిక్కీ. గోవా నుంచి వచ్చిన మోడ్రన్ గర్ల్ గా కనిపిస్తాను. మొదటిసారి చూడగానే ప్రేమలో పడిపోయేంత బ్యూటీ నేను. నా పాత్రను బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి బికినీ సీన్ బాగుంటుందని మంజుల చెప్పింది. అందులోనూ నా బాడీ బికినీకి సూటవుతుందని నాకు నమ్మకముంది. ఆ సీన్ కూడా చాలా అందంగా చిత్రీకరించారంటూ’’ బికినీ ధరించడం వెనుక సీక్రెట్ ఏమిటో చెప్పుకొచ్చింది.

‘‘మనసుకు నచ్చింది మూవీలో ప్రతి క్యారెక్టర్ కు ఓ కథ ఉంటుంది. ఎమోషన్లతో నిండిన ప్రేమకథగా డైరెక్టర్ మంజుల తీర్చిదిద్దింది. ఈ సినిమా చూస్తుంటే నా స్కూల్ డేస్ నాటి ప్రేమకథలు కూడా గుర్తొచ్చాయి. మొత్తంమీద ఇందులో నా రోల్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని’’ త్రిథ చెబుతోంది. అమ్మడి గ్లామర్ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.